Stock market : కొనసాగుతున్న లాభాల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి....

Updated : 12 Jan 2022 11:03 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అక్కడి టెక్ స్టాక్‌లు ర్యాలీకి దోహదం చేశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక దేశీయంగా ప్రీ-బడ్జెట్‌ ఆశలు, దేశీయ కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు సూచీలకు మద్దతునిస్తున్నాయి. నేడు మూడు దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. రిజల్ట్స్‌ సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఐటీ స్టాక్స్ రాణించే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   

ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 335 పాయింట్ల లాభంతో 60,952 వద్ద.. నిఫ్టీ (Nifty) 103 పాయింట్లు లాభపడి 18,159 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.76 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 సూచీలో హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐఓసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టీసీఎస్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, హెచ్‌యూఎల్‌, యూపీఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ : గారీ ఎక్లెస్‌ను కంపెనీ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అధ్యక్షునిగా నియమించింది. జనవరి 17, 2022 నుంచి ఆయన అదిల్‌ అహ్మద్‌ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

* టాటా టెలీసర్వీసెస్‌ : సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిలకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.850 కోట్ల వడ్డీని ఈక్విటీగా మార్చనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా లభించనుంది.   

* శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ : కంపెనీ 475 మిలియన్‌ డాలర్లు నిధులను సేకరించింది.  

* డెల్టా కార్ప్‌ : కంపెనీ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. రూ.70.38 కోట్లు లాభాలను నమోదు చేసింది. ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.120.82 కోట్ల నుంచి రూ.247.22 కోట్లకు పెరిగింది. 

* మారికో ‌: కంపెనీ రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించడంపై జనవరి 28న నిర్ణయం తీసుకోనుంది. 

* హిందాల్కో : కంపెనీ అనుబంధ సంస్థ అయిన నోవెలిస్‌ అమెరికాలో 365 మిలియన్‌ డాలర్లతో అల్యూమినియం రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. 

* ఛాయిస్‌ ఇంటర్నేషనల్‌ : జనవరి 14న రైట్స్‌ ఇష్యూపై నిర్ణయం తీసుకోనుంది.

* ది గ్రేట్‌ ఈస్టర్న్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్‌ : కంపెనీ రూ.310.01 ధర వద్ద రూ.30,000 షేర్లను బైబ్యాక్ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని