ఆరోగ్య బీమాకు సూప‌ర్ టాప్‌-అప్ జత చేశారా?

ప్ర‌స్తుతం కొన్ని బీమా సంస్థలు ముందుగా ఉన్న వ్యాధులకు కేవలం 12 నెలల వెయిటింగ్ పీరియడ్ కు త‌గ్గించి సూప‌ర్ టాప్ అప్ ను అందిస్తున్నాయి

Updated : 01 Jan 2021 16:34 IST

టాప్-అప్ పాలసీలలో ఉన్న పరిమితిని అధిగమించేందుకు కొన్ని కంపెనీలు ’ సూపర్ టాప్-అప్ ’ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒక ఏడాదిలో అయిన వైద్య ఖర్చులు అన్ని కలిపి ’ త్రెషోల్డ్‌ లిమిట్‌’ కోసం పరిగణిస్తారు . ఈ ’ త్రెషోల్డ్‌ లిమిట్‌’ దాటిన తరువాత ఎన్ని సార్లు క్లెయిమ్ చేసినా , సూపర్ టాప్-అప్ గరిష్ట హామీ వరకు చెల్లిస్తారు. ఈ సూపర్ టాప్-అప్ పాలసీల ప్రీమియం టాప్-అప్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.
టాప్-అప్ లో లాగా కాకుండా సూపర్ టాప్ అప్ లో, బీమా సంస్థ పాలసీ సమయంలో మీకు అందిన వైద్యం తాలూకా మొత్తం ఖర్చులను పరిగణలోకి తీసుకుంటుంది.

గరిష్ట కవరేజ్:
సూపర్ టాప్ అప్ ప్లాన్ అందించే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. సాధారణ చికిత్స, ప్రీ - పోస్ట్ హాస్పటలైజేషన్, రోడ్డు లేదా ఎయిర్ అంబులెన్స్ కవరేజ్, అవయవ దాత ఖర్చులు, ఉచిత వైద్య తనిఖీలు మొత్తం ఇందులో కవర్ అవుతాయి. ప్రస్తుతం రూ. 3 లక్షల నుంచి రూ. 50 లక్షల విలువ చేసే అనేక సూపర్ టాప్-అప్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు త్రెషోల్డ్‌ లిమిట్‌ తో ఎంపిక చేసుకోవచ్చు. గ‌తంలో వీటికి వెయిటింగ్ పిరీయ‌డ్ ఎక్కువ‌గా ఉండేది. అయితే ప్ర‌స్తుతం కొన్ని బీమా సంస్థలు ముందుగా ఉన్న వ్యాధులకు కేవలం 12 నెలల వెయిటింగ్ పీరియడ్ కు త‌గ్గించి సూప‌ర్ టాప్ అప్ ను అందిస్తున్నాయి.

వీటిని ఎంచుకున్నట్లైతే మీ ఆర్ధిక పరిస్థితి గాడిలో ఉంటుంది. అలాగే తక్కువ ప్రీమియంతో లభించే ఈ ప‌థ‌కం అత్యవసర సమయంలో మీ క్లిష్టమైన వైద్య అవసరాలకు కవచంలా పనిచేస్తుంది.

టాప్-అప్ కి సూపర్ టాప్-అప్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకుందాం:

TOPUP.png

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని