మూడు ర‌కాల పీపీఐ చెల్లింపు వ్య‌వ‌స్థ‌ల గురించి తెలుసా? 

సాధారణంగా ఉపయోగించే పిపిఐలు డెబిట్, క్రెడిట్ కార్డులు

Updated : 07 Apr 2021 15:43 IST

ప్రీపెయిడ్ చెల్లింపు వ్య‌వ‌స్థ‌ (పీపీఐ)తో వస్తువులు, సేవలను కొనుగోలు చేయ‌వ‌చ‌చు. వీటిలో ఆర్థిక సేవలు, చెల్లింపులు, నిధుల బదిలీలు కుటుంబానికి, స్నేహితులకు డ‌బ్బు పంపించ‌వ‌చ్చు. ఇందులో డ‌బ్బు ముందుగా లోడ్ చేసిన కార్డుల వంటివి.

పీపీఐల‌ కొన్ని ఉదాహరణలు పేటిఎమ్, గూగుల్ పే (సెమీ క్లోజ్డ్ సిస్టమ్ పిపిఐ), గిఫ్ట్ కార్డులు (క్లోజ్డ్ సిస్టమ్ పిపిఐ), డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు (ఓపెన్ సిస్టమ్ పిపిఐ). ఈ మూడు రకాల ప్రీపెయిడ్ చెల్లింపుల గురించి తెలుసుకుందాం.

క్లోజ్‌డ్ సిస్టమ్ పీపీఐ:
మీరు ఇలాంటి పీపీఐల నుంచి నగదు ఉపసంహరించుకోలేరు. ఇవి ఆ సంస్థ నుంచి మాత్రమే వస్తువులు, సేవలను కొనుగోలు చేయడంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో థ‌ర్డ్‌ పార్టీ సేవలకు చెల్లింపుల కోసం కూడా ఉపయోగించలేరు. వీటిని అధిక‌రిక చెల్లింపు వ్య‌వ‌స్థ‌గా ప‌రిగ‌ణించ‌లేము. అందుకే  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి  అవసరం లేదు.

సెమీ క్లోజ్‌డ్‌ సిస్టమ్ పీపీఐ:
ఈ చెల్లింపు వ్య‌వ‌స్థ‌ బ్యాంకులు లేదా బ్యాంకింగేత‌ర‌ సంస్థలు జారీ చేసినా, నగదు ఉపసంహరణకు మిమ్మల్ని అనుమతించవు.
ఉదాహరణకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్  పేజాప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో వంటి పీపీఐలను సెంట్రల్ బ్యాంక్ ఆమోదించింది. ఆర్థిక సేవలు, చెల్లింపులు, డబ్బుతో సహా వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి పేటిఎమ్, గూగుల్ పే వంటి బ్యాంకింగేత‌ర‌ పిపిఐలు ఆర్‌బీఐ అధికారం పొందాయి. బదిలీ, చెల్లింపుల సౌకర్యాలు మొదలైనవి వీటితో పొంద‌వ‌చ్చు. పిపిఐలను చెల్లింపుల‌ను అంగీక‌రించే వ్యాపారాల వ‌ద్ద‌ దీనిని ఉప‌యోగించ‌వ‌చ్చు.
 ఓపెన్ సిస్టమ్ పిపిఐ:
సాధారణంగా ఉపయోగించే పిపిఐలు డెబిట్, క్రెడిట్ కార్డులు. మీరు ఈ పిపిఐల నుంచి నగదు ఉపసంహరణ చేయవచ్చు. అయితే, క్రెడిట్ కార్డు నుంచి నగదు ఉపసంహరించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అలా చేయడం ద్వారా, నగదు ఉపసంహరణ రోజు నుంచి మీకు అధిక వడ్డీ రేటు వసూలు చేయబడుతుంది.
బ్యాంకులు జారీ చేసిన ఈ పిపిఐలను (సెంట్రల్ బ్యాంక్ ఆమోదించింది) ఏ వ్యాపారి వద్దనైనా ఆర్థిక సేవలు, చెల్లింపుల సౌకర్యాలు మొదలైన వస్తువులు, సేవల కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు. ఈ పిపిఐల ద్వారా ఎటిఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్, బిజినెస్ కరస్పాండెంట్లలో నగదు ఉపసంహరణకు అనుమతి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని