Two Wheeler Loans: ద్విచ‌క్ర వాహ‌నాల‌కు రుణాలు - వ‌డ్డీ రేట్లు ఎంత?

ద్విచ‌క్ర వాహ‌నం సొంతం చేసుకోవాల‌నుకునే కోరిక ఉంటే చాలు రుణాలు మంజూరు చేసే సంస్థ‌లు అనేకంగా ఉన్నాయి.

Updated : 23 Aug 2021 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ‌త కొన్నేళ్ల నుంచి ద్విచ‌క్ర వాహ‌నాల ప్ర‌యాణాలు విప‌రీతంగా పెరిగాయి. దీనికి తోడు కొవిడ్ ప‌రిస్థితుల దృష్ట్యా వ్య‌క్తిగ‌త వాహ‌నాల సంచారం బాగా ఎక్కువైంది. అంతేకాకుండా పెట్రో ధ‌ర‌లు కూడా కారులో ప్ర‌యాణించేవారిని అధిక మైలేజీ ఇచ్చే ద్విచ‌క్ర వాహ‌నాల మీద‌కు మ‌న‌సు మ‌ళ్లేలా చేస్తున్నాయి. ఇరుకైన రోడ్ల‌పై ప్ర‌యాణించేవారికి కారు క‌న్నా ద్విచ‌క్ర వాహ‌నం మెరుగ్గా ఉండ‌టం, వేగంగా గమ్య‌స్థానానికి చేర‌డం కూడా ద్విచ‌క్ర వాహ‌నాలు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది. మ‌న‌సులో ద్విచ‌క్ర వాహ‌నం సొంతం చేసుకోవాల‌నుకునే కోరిక ఉంటే చాలు రుణాలు మంజూరు చేసే సంస్థ‌లు అనేకంగా ఉన్నాయి. ఈ వాహ‌నాల కొనుగోలుకు రుణాలు ఇచ్చే బ్యాంకులు కూడా చాలానే ఉన్నాయి. మోటారు వాహ‌నాల‌కు కోసం ఇప్పుడు రుణాలు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థ‌ల ద్వారా వేగంగా మంజూరు అవుతున్నాయి. అయితే రుణం తీసుకునేట‌ప్పుడు వ‌ర్తించే వ‌డ్డీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ పేమెంట్ ఛార్జీలు మొద‌లైన వాటి వివ‌రాలు బ్యాంకుకు, బ్యాంకుకు ఎంతేసి ఉన్నాయో స‌రి చూసుకోవాలి. క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి మామూలుగానే రుణం మంజూరు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి.

ఈ నేపథ్యంలో రుణ నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో మీకు స‌హాయ‌ప‌డానికి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుతో స‌హా ప్ర‌స్తుతం ద్విచ‌క్ర వాహ‌న రుణాల‌పై అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు అందించే 20కి పైగా ప్ర‌ముఖ బ్యాంకుల జాబితా ఈ కింద ఇస్తున్నాం. 3 సంవ‌త్స‌రాల‌కు లక్ష రూపాయల రుణానికి ఈఎంఐ ఎంత కట్టాల్సి ఉంటుందో అందిస్తున్నాం.


*రుణాల‌పై ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని