5G Trails: 5జీ ట్రయల్స్‌లో వొడాఫోన్‌ మరో మైలురాయి.. 4Gbpsతో డేటా బదిలీ!

దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తాజాగా మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Published : 26 Nov 2021 20:20 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జరుగుతున్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌) తాజాగా మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా నిర్వహించిన ట్రయల్స్‌లో 4Gbps వేగాన్ని అందుకున్నట్లు ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్‌లో అమ్మకానికి ఉంచనున్న 26 గిగాహెర్జ్‌ లేదా మిల్లీ మీటర్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌పై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ వేగాన్ని అందుకున్నట్లు  వీఐఎల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగబీర్‌ సింగ్‌ తెలిపారు.

నోకియాతో కలిసి గాంధీనగర్‌లో, ఎరిక్సన్‌తో కలిసి పుణెలో 5జీ ప్రయోగాలు కొనసాగుతున్నాయని సింగ్‌ వివరించారు. 5జీ ట్రయల్స్‌ గడువును కేంద్రం పొడిగించిందని చెప్పారు. వచ్చే ఏడాది మే వరకు లేదంటే స్పెక్ట్రమ్‌ వేలం ఫలితాలు వెలువడే వరకు ఏది ముందైతే అంతవరకు ఈ ప్రయోగాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి తేదీలను ఇంతవరకు ప్రభుత్వం వెల్లడించలేదని కంపెనీ చీఫ్‌ రెగ్యులేటరీ అండ్‌ కార్పొరేటర్‌ ఆఫీసర్‌ పి.బాలాజీ తెలిపారు.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని