టీకాల పంపిణీకి ప్రభుత్వంతో జట్టు కడతాం

కరోనా టీకాల పంపిణీ, పాలన విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమ సంఘం ఫిక్కీ గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక సవివర ప్రణాళికను

Published : 08 Jan 2021 01:04 IST

పరిశ్రమ వర్గాల సంసిద్ధత

దిల్లీ: కరోనా టీకాల పంపిణీ, పాలన విషయంలో ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమ సంఘం ఫిక్కీ గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించి ఒక సవివర ప్రణాళికను వ్యూహ పత్రం(ప్రొటెక్టింగ్‌ ఇండియా-పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ ఫర్‌ వ్యాక్సినేటింగ్‌ అగెయినెస్ట్‌ కొవిడ్‌-19) రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. ‘ప్రస్తుతం మన అతిపెద్ద, సంక్లిష్ట వ్యాక్సినేషన్‌ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భంలో భాగస్వామ్యాలు, సహకారాలే విజయానికి కీలకం కానున్నాయి. ప్రైవేటు రంగ కంపెనీల నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారికి అవకాశం ఇస్తుందనే భావిస్తున్న’ట్లు ఫిక్కీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిక్కీ-ఈవై నివేదిక ప్రకారం..భారత్‌కు 1.2-1.4 లక్షల టీకా కేంద్రాలు, లక్ష మంది వైద్యులు, 2 లక్షల మంది అనుబంధ సిబ్బంది అవసరం. దేశంలో 70 శాతం ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రైవేటు ఆరోగ్యరంగమే బాధ్యత వహిస్తోంది కాబట్టి అవసరమైన మానవ, మౌలిక వనరులను అందించే సామర్థ్యం ఉందని ఫిక్కీ గుర్తు చేసింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల కోసం ప్రైవేటు కంపెనీలు ఎదురు చూస్తున్నాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని