పాస్‌బుక్‌ను సుల‌భంగా మొబైల్‌లో చూసుకోవ‌చ్చు

ఈ సేవ‌ల‌ను పొందేందుకు యూఏఎన్, ఈపీఎఫ్ఓతో న‌మోదైన మొబైల్ నంబ‌ర్ ఉండాలి.....

Updated : 01 Jan 2021 17:17 IST

ఈ సేవ‌ల‌ను పొందేందుకు యూఏఎన్, ఈపీఎఫ్ఓతో న‌మోదైన మొబైల్ నంబ‌ర్ ఉండాలి

పెన్షనర్లు వారి పాస్‌బుక్‌ను చెక్ చేసుకోవ‌డం, మొబైల్ ఫోన్ల నుంచే వారి జీవన్ ప్రమాణ్ పత్ర లేదా లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా అప్‌డేట్ చేయడం సులభతరం చేస్తూ, ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు ఉమాంగ్ యాప్ ద్వారా 16 వేర్వేరు సేవలను పొంద‌డానికి అనుమతిస్తుంది.

66 లక్షల మంది పెన్షనర్లకు సుర‌క్షిత‌మైన సేవ‌లను అందించేందుకు ఈపీఎఫ్ఓ ‘View Pensioner Passbook’ తో పాటు ‘Jeevan Pramaan Patra’ సేవలను అప్‌డేట్ చేసింది. దీనికి చందాదారుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఏప్రిల్-జులై 2020 కాలంలో క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఈ ఆన్‌లైన్ సేవ‌ల‌ను చాలా బాగా ఉప‌యోగించుకున్నారు.

ఈ సేవ‌ల‌ను పొందేందుకు మీ వ‌ద్ద యాక్టివ్‌లో ఉన్న యూఏఎన్, ఈపీఎఫ్ఓతో న‌మోదైన మొబైల్ నంబ‌ర్ ఉండాలి. 90 శాతం వినియోగారులు దీనిని వినియోగించుకుంటున్నారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉమాంగ్ యాప్ ద్వారా 11.27 ల‌క్ష‌ల చందాదారులు క్లెయిమ్ చేసుకున్నారు. గ‌తేడాది ఇదే స‌మ‌యంతో పోలిస్తే 180 శాతం పెరిగాయ‌ని పేర్కొంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తూ ఈపీఎఫ్ఓ చందాదారులు ప‌నిని మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని