Zomato: సరకుల పంపిణీ సేవలకు జొమాటో స్వస్తి

ఆన్‌లైన్‌ ఆధారిత ఆహార పంపిణీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించిన నిత్యావసర సరకుల పంపిణీ(గ్రోసరీ డెలివరీ) ‘గ్రోఫర్స్‌’ సేవల్ని సెప్టెంబరు 17 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది....

Published : 12 Sep 2021 17:58 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ ఆధారిత ఆహార పంపిణీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించిన నిత్యావసర సరకుల పంపిణీ(గ్రోసరీ డెలివరీ) ‘గ్రోఫర్స్‌’ సేవల్ని సెప్టెంబరు 17 నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సరకుల పంపిణీ కోసం ప్రస్తుతం తాము అవలంబిస్తున్న విధానం ఫలితాలివ్వడం లేదని తెలిపింది. దీంతో వినియోగదారుల అవసరాల్ని సకాలంలో తీర్చలేకపోతున్నామని తెలిపింది. అలాగే తక్కువ సమయంలో సరకులు అందజేస్తామన్న నియమానికి కట్టుబడడం సాధ్యం కావడం లేదని స్పష్టం చేసింది. పంపిణీ జాబితాలో ఎక్కువ మొత్తంలో సరకులు ఉండడం.. నిల్వ స్థాయిలు తరచూ మారుతుండడం వల్ల సకాలంలో అందించడం వీలుపడడం లేదని పేర్కొంది.

దాదాపు రూ.745 కోట్లు పెట్టుబడిగా పెట్టి గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటాలు సొంతం చేసుకున్న జొమాటో.. జులైలో తమ వేదికపై ప్రయోగాత్మకంగా సరకుల పంపిణీని ప్రారంభించింది. కానీ, అది సత్ఫలితాలివ్వకపోవడంతో ఈ రంగం నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. అయితే, నేరుగా జొమాటో వేదికగా సరకుల పంపిణీని ప్రారంభించడం కంటే.. గ్రోఫర్స్‌లో పెట్టుబడులు పెట్టడం వల్లే తమ కంపెనీలోని వాటాదారులకు లాభదాయకమన్న నిర్ణయానికి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని