ఆధార్‌తో ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ ఖాతా ప్రారంభించండి

దీంతో సుల‌భంగా ఆన్‌లైన్ ద్వారా ఎన్‌పీఎస్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు

Published : 30 Apr 2021 12:08 IST

కరోనావైరస్ మహమ్మారి నేప‌థ్యంలో, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతా తెరిచే విధానాన్ని ఇప్పుడు మ‌రింత సుల‌భ‌త‌రం చేశారు. ఎన్‌పీఎస్ కింద కొత్త చందాదారులను చేర్చుకునేందుకు వీలుగా ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ కేవైసి ప్రక్రియను అనుమతించిన‌ట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డిఏ) పేర్కొంది.

ప్రస్తుతం, ఇ-ఎన్‌పీఎస్ కింద నమోదు ఆధార్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసి ద్వారా లేదా పాన్, బ్యాంక్ ఖాతా ద్వారా జరుగుతుంది. ఎన్‌ఎస్‌డీఎల్‌సీఆర్ఏ ఇప్పుడు ఇ-ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్‌లో ఎన్‌పీఎస్ చందాదారుల నమోదు కోసం ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ ఇ-కేవైసి ప్రామాణీకరణ కార్యాచరణను ప్రారంభించింది.
ఇ-ఎన్‌పీఎస్ అనేది ఆన్‌లైన్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు (సీఆర్ఏ) నిర్వ‌హించే ఆన్‌లైన్ ఎన్‌పీఎస్ ఆన్‌బోర్డింగ్ పోర్టల్, ఇందులో ఎన్‌పీఎస్‌ ఆన్‌లైన్‌లో ప్రారంభించి  డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ప్రస్తుతం ఉన్న చందాదారులు వారి టైర్ -2 ఖాతాను యాక్టివేట్ చేయవచ్చు.
ఆన్‌లైన్ ఆధార్ ఇ-కెవైసి ఖాతా ప్రారంభ ప్రక్రియను సులభతరం చేస్తుంది, ఇది చందాదారులకు ఇది తక్షణ శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) తో ప్రత్యేకమైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తుంది.

ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ :

1. దీనికి యూఐడీఏఐ అందించిన ఆధార్ సంఖ్య లేదా 16-అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ (వీఐడీ) సంఖ్య అవ‌స‌రం

2. ఆధార్ న‌మోదిత మొబైల్ నంబర్

ఇ-ఇఎన్‌పీఎస్‌లో ఆధార్ ఆధారిత ఇ-కేవైసి నమోదు ప్రక్రియ:
1. ఆధార్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఎన్‌పీఎస్ ఖాతా తెరవడానికి, చందాదారులు ఇ-ఎన్‌పీఎస్ పోర్టల్ ఓపెన్ చేయాలి
2.  అక్క‌డ “నేషనల్ పెన్షన్ సిస్టమ్” పై క్లిక్ చేసి, ఆపై “రిజిస్ట్రేషన్” ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
3. చందాదారులు ఇప్పుడు ఖాతా ప్రారంభించే కేట‌గిరీని ఎంచుకోవాలి - “వ్యక్తిగత చందాదారుడు” లేదా “కార్పొరేట్ చందాదారుడు”. ఇంకా, దరఖాస్తుదారుడి స్టేట‌స్‌ “సిటిజన్ ఆఫ్ ఇండియా” లేదా “నాన్-రెసిడెంట్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఐ)” లేదా “ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ)” నుంచి ఎన్నుకోవాలి.
4. చందాదారులు రిజిస్ట్రేషన్ సమయంలో “ఆధార్ ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ కేవైసి” ఎంచుకోవాలి, ఖాతా తెరవడానికి ‘టైర్ రకాలను’ ఎంచుకోవాలి.
5. ఇప్పుడు ఆధార్ లేదా  వర్చువల్ ఐడీ నంబ‌ర్‌ అందించాలి . త‌ర్వాత‌ జ‌న‌రేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.  ఒకవేళ, వర్చువల్ ఐడీ  లేక‌పోతే ముందు దానిని జ‌న‌రేట్ చేసుకోవాలి.
6.  ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి.
 7. ఆధార్ వివరాలను ఉపయోగించడానికి సమ్మతితో పాటు ఓటీపీ సమర్పించిన తరువాత, జనాభా వివరాలు (పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో మొదలైనవి) ఆధార్ రికార్డుల నుంచి సేక‌రిస్తారు.

8. ఎన్‌పీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇతర తప్పనిసరి వివరాలను చందాదారుడు పూర్తి చేయాలి.

9.ఆ త‌ర్వాత‌ ఎన్‌పీఎస్‌లో డిపాజిట్ చేయాలి. డిజిటల్ ప్రామాణీకరణ ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి (రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీకి వ‌చ్చే ఓటీపీ ద్వారా చేయ‌వ‌చ్చు).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని