మోటారు బీమా క్లెయిమ్స్ ప‌రిష్కారానికి `ఆటోమోవిల్‌` యాప్‌

ఈ మొబైల్ అప్లికేష‌న్ ఏజెంట్లు, కార్ల య‌జ‌మానుల‌కు సేవ‌లందించే పూర్తి మోటారు బీమా ప్లాట్‌ఫామ్‌గా ప‌ని చేస్తుంది.

Updated : 05 Apr 2022 11:43 IST

మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలుదారులు త‌మ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌ని సుల‌భంగా ప‌రిష్క‌రించుకోవ‌డానికి వీలుగా క్లెయిమ్‌ యాప్‌ను సార్ట‌ప్ సంస్థ `ఆటోమోవిల్‌` ప్రారంభించింది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ ల‌క్ష‌కు పైగా ఏజంట్ల‌తో ఇంట‌ర్‌ఫేస్‌ను అందిస్తుంది. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌ల‌కు అందుబాటులో ఉంద‌ని `ఆటోమోవిల్‌` ప్ర‌తినిధి తెలిపారు.

ఇన్సూరెన్స్ కంపెనీలు, వారి వినియోగదారులతో స‌హా అంద‌రికీ సిస్ట‌మ్‌లో మ‌రింత సామ‌ర్ధ్యాన్ని తీసుకురావ‌డం ద్వారా బీమా క్లెయిమ్ ఖ‌ర్చుల‌ను త‌గ్గించ‌డం ఈ యాప్ ప్ర‌ధాన ల‌క్ష్యం. మొబిలిటీ స్టార్ట‌ప్ `ఆటోమోవిల్‌` దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని మోటారు బీమా ఏజెంట్లు, బ్రోక‌ర్ల కోసం యాక్సిడెంట్ క్లెయిమ్‌ల న‌మోదు, ప్రాసెసింగ్ కోసం మొబైల్ అప్లికేష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు.

ఈ యాప్ ఈ ఏడాది జూన్ నాటికి `ఐఓఎస్‌` ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వినియోగ‌దారుల‌కు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేష‌న్ పూర్తి మోటారు బీమా ప్లాట్‌ఫామ్‌గా ప‌ని చేస్తుంది. భార‌త‌దేశం అంత‌టా మోటార్ క్లెయిమ్‌ల‌ను నిర్వ‌హించ‌డంలో అగ్ర‌గామిగా ఉన్న ఈ స్టార్ట‌ప్ సంస్థ‌, మిగ‌తా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌తో పోలిస్తే 40% కంటే త‌క్కువ ఖ‌ర్చు తో సేవ‌ల‌ను అందిస్తోంద‌ని ఈ కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు. 2016లో కార్య‌క‌లాపాలు ప్రారంభించిన `ఆటోమోవిల్‌` 20 న‌గ‌రాల్లో ఉనికిని క‌లిగి ఉంది. నెల‌కు దాదాపు 4 వేల మంది కార్ల య‌జ‌మానుల‌కు ఇన్సూరెన్స్, ఇత‌ర‌ సేవ‌ల‌ను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని