Credit Card Usage: ఒక్కోసారి క్రెడిట్ కార్డు వాడ‌ట‌మే మంచిది... ఎలా అంటే?

శ‌ర‌త్ అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకొని ఈ మ‌ధ్యే ఉద్యోగంలో చేరాడు. అయిదంకెల వేత‌నం అందుకుంటున్నాడు. స్నేహితులు, బంధువులు… ఇంకా వివిధ మాధ్య‌మాల్లో ఉన్న స‌మాచారంతో క్రెడిట్ కార్డు వాడ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని అనుకున్నాడు. పైగా క్రెడిట్ కార్డుల‌పై

Updated : 29 May 2022 16:50 IST

క్రెడిట్‌ కార్డు వాడాలా? వద్దా? వాడితే మంచిదేనా? మీకు ఎప్పుడో ఓసారి ఈ డౌట్‌ వచ్చే ఉంటుంది. లేదంటే మీ స్నేహితులు ఎవరో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగే ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఈ కథనంలో తెలుసుకోవచ్చు. ఏ సందర్భంలో కార్డు వాడొచ్చో ఓ లుక్కేయండి.  

  1. క్రెడిట్ కార్డును తెలివిగా, స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించి దాని నుంచి గ‌రిష్ఠ లాభం పొందే విధంగా చూసుకోవాలి. సాధార‌ణ, రోజువారీ ఖ‌ర్చుల‌ను క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవ‌చ్చు. నెల‌వారీ స‌రుకుల కొనుగోలుకు, బండిలో పెట్రోల్ పోయించుకునేందుకు క్రెడిట్ కార్డు వాడ‌టం వ‌ల్ల నెల‌కు ఎంత కేటాయిస్తున్నామో రికార్డు మెయింటెన్ చేసిన‌ట్టు అవుతుంది.
  2. ఆన్‌లైన్‌లో సినిమా, బ‌స్‌, రైలు టికెట్ల బుకింగ్‌ను క్రెడిట్ కార్డుతో చేస్తే కొంత రాయితీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. సినిమా బుకింగ్ ప్లాట్‌ఫాంపై కొన్ని ర‌కాల క్రెడిట్‌ కార్డుల ఉప‌యోగంతో ఒక టికెట్ కొనుగోలుపై మ‌రో టికెట్‌ను ఉచితంగా ఇస్తున్నారు.
  3. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో లేదా నెలాఖ‌రులో పొదుపు ఖాతాలో డ‌బ్బు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు క్రెడిట్ కార్డు ఉప‌యోగ‌ప‌డుతుంది.
  4. కొన్ని సంద‌ర్భాల్లో డెబిట్ కార్డు కంటే క్రెడిట్ కార్డును ఉప‌యోగిస్తేనే మేలు. ఆన్‌లైన్‌లో డెబిట్ కార్డును ఉప‌యోగించిన‌ప్పుడు ఏదైనా మోసం జ‌రిగితే మొత్తం ఖాతాలో ఉన్న సొమ్మును రిస్క్‌లో ఉంచిన‌ట్టే. మోస‌గాళ్లు ఏ స‌మ‌యంలోనైనా మొత్తం ఖాతాలో సొమ్ము మాయం చేసేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌.
  5. డెబిట్ కార్డును స్వైప్ చేసిన‌ప్పుడు పొర‌పాటున ఎక్కువ అమౌంట్ ఎంట‌ర్ చేస్తే తిరిగి ఆ డ‌బ్బును ఖాతాలోకి ర‌ప్పించేందుకు చాలా స‌మ‌యమే ప‌డుతుంది. ఈ లోపు ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు త‌క్కువ ప‌డ‌తాయి. అదే క్రెడిట్ కార్డుతో ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డితే ఆ పొర‌పాటును సంబంధిత వ‌ర్గాల‌కు తెల‌ప‌డం ద్వారా క్రెడిట్‌ను వెన‌క్కి తెప్పించ‌వ‌చ్చు. అంతేకాదు ఆ క్రెడిట్ సొమ్మును చెల్లించ‌కుండా నిలువ‌రించ‌వ‌చ్చు.
  6. ఖ‌రీదైన వ‌స్తువుల కొనుగోలుకు క్రెడిట్ కార్డు ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌గినంత మొత్తంలో డ‌బ్బు లేక‌పోయినా.. క్రెడిట్ కార్డు ఉంటే చాలు మ‌నం అనుకున్న వ‌స్తువును కొన‌వ‌చ్చు. దీనిని EMIగా క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు.
  7. చివ‌ర‌గా క్రెడిట్ కార్డును స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి క్రెడిట్ స్కోరు సాధించేందుకు వీల‌వుతుంది. భ‌విష్య‌త్‌లో బ్యాంకు నుంచి రుణాల ఆమోదం, మంజూరు త్వ‌ర‌గా జ‌రిగేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

మ‌రి మీరూ క్రెడిట్ కార్డును బాధ్య‌తాయుతంగా వాడ‌తార‌ని ఆశిస్తున్నాం!

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని