Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.

Updated : 23 Jun 2022 16:28 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆరంభంలోనే ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ మొదలు పెట్టిన మార్కెట్లు కాసేపటికే లాభాల బాట పట్టాయి. వాహన రంగ షేర్లు పుంజుకోవడం, బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా  షేర్లు రాణించడంతో మార్కెట్లు లాభపడ్డాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 443.19  పాయింట్లు లాభపడి 52,265.72 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 143.40 పాయింట్ల లాభంతో 15,556.70 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.78.34గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీల్లో  మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్‌, హైచర్‌ మోటర్స్, ఎంఅండ్ఎం, బజాజ్‌ ఆటో షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని