Cylinder Price: వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు.. ఎంత పెరిగిందంటే?

చమురు సంస్థలు ఉదయాన్నే సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి

Updated : 22 Mar 2022 12:10 IST

హైదరాబాద్‌: చమురు సంస్థలు ఉదయాన్నే సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలను కూడా పెంచాయి. గత అక్టోబర్‌లో రూ.15 పెరిగిన వంట గ్యాస్‌ ధర.. అప్పటి నుంచి నిలకడగా ఉంది. తాజాగా 14 కేజీల సిలిండర్‌పై ధర రూ.50 పెరిగింది. దీంతో తెలంగాణలో వంటగ్యాస్‌ సిలిండర్ ధర రూ.1,002కు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,008కు పెరిగింది. పెరిగిన ధర నేటి నుంచి అమల్లోకి వచ్చినట్టు చమురు సంస్థలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌లో సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని