DGGI: స్విగ్గీ, జొమాటోకు జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు!

Zomato and Swiggy: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Published : 22 Nov 2023 22:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy)కు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (DGGI) జీఎస్టీ డిమాండ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ప్రీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. జులై 2017 నుంచి మార్చి 2023 వరకు జొమాటో రూ.400కోట్లు, స్విగ్గీ రూ.350 కోట్ల మేర బకాయి పడినట్లు ఆ నోటీసుల్లో పేర్కొంది. డెలివరీ అనేది సేవ కాబట్టి 18శాతం జీఎస్టీ కట్టాలని డీజీజీఐ వాదన. దీనిపై స్విగ్గీ, జొమాటో స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని