వరుసగా 12వ రోజు.. ఇంధన ధరలు పైకే!

దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు

Updated : 20 Feb 2021 08:31 IST

దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ  చమురు సంస్థలు శనివారం మరోసారి ఇంధన ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై 39పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి.  కాగా ఇంధన ధరలు పెరగడం వరుసగా ఇది 12వ రోజు కావడం గమనార్హం. తాజాగా పెరిగిన ధరలతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.90 మార్కును దాటింది. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.58గా, డీజిల్‌ ధర రూ.80.97గా నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.18, డీజిల్‌ ధర రూ.88.31గా నమోదైంది. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రో ధరల పెంపు తమ జీవితాలపై పెను భారం మోపుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నగరం పెట్రోల్‌ ధర లీటరుకు డీజిల్‌ ధర లీటరుకు
దిల్లీ రూ.90.58 రూ.80.97
ముంబయి రూ.97.00 రూ.88.06
హైదరాబాద్‌ రూ.94.18 రూ.88.31
బెంగళూరు రూ.93.61 రూ.85.84

ఇవీ చదవండి..

అంగారకుడిపై నవ్య చరిత్ర

బంగారంపై రుణమా?ఇవి గుర్తుంచుకోండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని