ఫోర్బ్స్‌ ఉత్తమ చిన్న- మధ్య కంపెనీల్లో భారత్‌ నుంచి 24

ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలో విక్రయాల విలువ 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7900 కోట్ల) లోపు ఉంటే… అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 200 చిన్న, మధ్య తరహా నమోదిత సంస్థల జాబితాను (బెస్ట్‌ అండర్‌ ఏ బిలియన్‌ లిస్ట్‌) ఫోర్బ్స్‌ ఆసియా విడుదల చేసింది.

Published : 11 Aug 2022 05:51 IST

2-3 స్థానాల్లో ఆర్తి ఇండస్ట్రీస్‌, దీపక్‌ నైట్రేట్‌

సింగపూర్‌: ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలో విక్రయాల విలువ 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7900 కోట్ల) లోపు ఉంటే… అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 200 చిన్న, మధ్య తరహా నమోదిత సంస్థల జాబితాను (బెస్ట్‌ అండర్‌ ఏ బిలియన్‌ లిస్ట్‌) ఫోర్బ్స్‌ ఆసియా విడుదల చేసింది. 2022కు రూపొందించిన ఈ జాబితాలో భారత్‌ నుంచి 24 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. కొవిడ్‌-19 పరిణామాల అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఎంపిక ఆధారిత వినియోగం వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని ఫోర్బ్స్‌ ఆసియా తెలిపింది. వార్షిక విక్రయాలు 10 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.79 కోట్ల) నుంచి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7900 కోట్ల) లోపు ఉన్న 20,000 నమోదిత కంపెనీల నుంచి ఈ అత్యుత్తమ 200 కంపెనీలను ఎంపిక చేసినట్లు ఫోర్బ్స్‌ ఆసియా తెలిపింది. ఈ జాబితాలో గతేడాది ఉన్న 75 కంపెనీలు , తిరిగి ఈ ఏడాదీ చోటు దక్కించుకోవడం విశేషం. కొవిడ్‌-19 పరిణామాల నుంచి కంపెనీలు వేగంగా కోలుకుంటున్నాయనే విషయాన్ని ఇది సూచిస్తోంది. జాబితాలో విక్రయాల పరంగా థాయ్‌లాండ్‌కు చెందిన ఏపీ సంస్థ మొదటి స్థానంలో ఉంది. 2, 3  స్థానాల్లో మన దేశానికి చెందిన ఆర్తి ఇండస్ట్రీస్‌, దీపక్‌ నైట్రేట్‌ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని