2023-24 సెప్టెంబరు త్రైమాసికానికి నష్టాలుండవ్‌!

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికం నుంచి 2023-24 సెప్టెంబరు త్రైమాసికం మధ్య లాభ-నష్ట రహిత స్థితి (బ్రేక్‌ ఈవెన్‌)కి చేరాలని లక్ష్యం

Published : 11 Aug 2022 05:29 IST

జొమాటో సీఎఫ్‌ఓ అక్షాంత్‌ గోయెల్‌

దిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) మార్చి త్రైమాసికం నుంచి 2023-24 సెప్టెంబరు త్రైమాసికం మధ్య లాభ-నష్ట రహిత స్థితి (బ్రేక్‌ ఈవెన్‌)కి చేరాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు కంపెనీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) అక్షాంత్‌ గోయెల్‌ అనలిస్ట్‌ కాల్‌లో వెల్లడించారు. వచ్చే కొన్నేళ్లలో క్విక్‌ కామర్స్‌పై 400 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న ప్రతిపాదనను 320 మి.డాలర్లకు కుదిస్తున్నట్లు సీఎఫ్‌ఓ వెల్లడించారు. జొమాటో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌లో రూ.186 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక నష్టం రూ.360.7 కోట్లతో పోలిస్తే, దాదాపు సగానికి పరిమితం చేసుకుంది. ఏకీకృత కార్యకలాపాల ఆదాయం కూడా రూ.844.4 కోట్ల నుంచి రూ.1,413.9 కోట్లకు చేరింది.

* ఈ ఏడాది జూన్‌లో బ్లింక్‌ కామర్స్‌ ప్రై.లి.ను (గతంలో గ్రోఫర్స్‌ ఇండియా) రూ.4,447.48 కోట్లతో షేర్ల స్వాపింగ్‌ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయబోతున్నట్లు జొమాటో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాపారంలో 150 మి.డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ వ్యాపారం బ్రేక్‌ఈవెన్‌ సాధించడానికి 320 మి.డాలర్ల వరకు పెట్టుబుడులు పెట్టాల్సి రావొచ్చని అంచనా వేశామని సీఎఫ్‌ఓ వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని