ఆసియా అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ

ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో ఒకరిగా.. ఆసియాలో, భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ తన స్థానాన్ని కోల్పోయారు.

Published : 02 Feb 2023 03:15 IST

హిండెన్‌బర్గ్‌ ఉదంతంతో వెనక్కివెళ్లిన అదానీ

దిల్లీ: ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో ఒకరిగా.. ఆసియాలో, భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ తన స్థానాన్ని కోల్పోయారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.7 లక్షల కోట్ల మేర తగ్గడం ఇందుకు నేపథ్యం. ఫలితంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ తిరిగి అగ్రస్థానానికి చేరారు. వారం కిందటి వరకూ ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న అదానీ బుధవారం నాటికి 15వ స్థానానికి పడిపోయారు. గతేడాది సంపాదించిన 44 బిలియన్‌ డాలర్లను ఒక్క వారంలో పోగొట్టుకున్న అదానీ 75.1 బిలియన్‌ డాలర్ల సంపదతో మిగిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని