2023-24లో భారత వృద్ధి 6%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2023-24) వృద్ధి అంచనాల్లో ఎలాంటి మార్పు చేయకుండా 6 శాతంగానే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

Updated : 28 Mar 2023 02:28 IST

ఎస్‌అండ్‌పీ అంచనాలు యథాతథం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2023-24) వృద్ధి అంచనాల్లో ఎలాంటి మార్పు చేయకుండా 6 శాతంగానే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2024-25, 2025-26లో 6.9 శాతంగాను, 2026-27లో 7.1 శాతంగా వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024-26 మధ్య సగటున వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 6.8 శాతం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. అయితే వాతావరణపరమైన అంశాల రీత్యా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కీలక రేట్లను ఆర్‌బీఐ మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది గాడిలో పడే అవకాశం ఉందని వివరించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. 2023లో అమెరికా, ఐరోపా ప్రాంతం వృద్ధి నెమ్మదించొచ్చని.. వరుసగా 0.7 శాతం, 0.3 శాతం మేర వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు