Stock Market: ఈ షేర్లు.. సిరులొలికించే మతాబులు..!

దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2079 సంవత్‌ ట్రేడింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. ఈ దీపావళి నుంచి 2080 సంవత్‌ ఆరంభం కాబోతోంది.

Updated : 12 Nov 2023 08:43 IST

దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2079 సంవత్‌ ట్రేడింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. ఈ దీపావళి నుంచి 2080 సంవత్‌ ఆరంభం కాబోతోంది. నూతన సంవత్‌కు వివిధ బ్రోకరేజీ సంస్థలు తమదైన అంచనాలతో, పెట్టుబడికి అనుకూలమైన రంగాలు, కంపెనీల షేర్లను సిఫారసు చేశాయి. ఆయా సంస్థలు సూచించిన షేర్లు ఇవీ..

ఈనాడు, హైదరాబాద్‌: సిరుల పండగ దీపావళి. వెలుగులు పంచే ఈ పర్వదినం స్టాక్‌ మార్కెట్‌ మదుపరులకు ఎంతో ప్రత్యేకం. నేటి నుంచి తమ కొత్త పెట్టుబడుల ప్రణాళికలు వేసుకుంటారు. ఏడాది కాలంగా తాము మదుపు చేసిన షేర్లు ఎంత మేరకు రాబడులు ఇచ్చాయో సమీక్షించుకుంటారు. వచ్చే దీపావళి నాటికి సంపదను పెంచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో సంవత్‌ 2080లో సానుకూలతలు.. ప్రతికూలతలను ఒకసారి గమనిద్దాం...
వచ్చే దీపావళి వరకూ చూస్తే.. దేశంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మేలో సాధారణ ఎన్నికలున్నాయి. ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు, బాండ్లపై రాబడులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ పరిస్థితులనూ గమనించాలి. నిఫ్టీ 18 శాతం వరకూ వార్షిక సగటు రాబడినిస్తుందనే అంచనాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.

  • ప్రపంచ వ్యాప్తంగా కొన్ని అనిశ్చిత పరిస్థితులున్నప్పటికీ భారత్‌ పనితీరు మెరుగ్గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.
  • భారత్‌లో రుణాల వృద్ధి 15-16 శాతం వరకూ ఉంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాలకు ఇది కలిసొచ్చే అంశం. రిటైల్‌ రుణాలకూ గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులు, వాహన, ఇంటి రుణాల్లో వృద్ధి ఎక్కువగా ఉంటోంది.
  • ప్రజల్లో ఖర్చు చేసే శక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగ వస్తువులు, ఆభరణాలు, వాహనాలు, ఇళ్ల కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త తరం ఫిన్‌టెక్‌ సంస్థలకు ఇది మంచి అవకాశాలను ఇస్తోంది.
  • ప్రభుత్వం మౌలిక వసతులపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. కాబట్టి, నిర్మాణ రంగంలోని సంస్థలూ, ఈ రంగానికి అనుబంధంగా ఉన్న కంపెనీల పనితీరు సానుకూలంగా ఉండే వీలుంది.

వ్యూహం ఎలా ఉండాలంటే..

పెట్టుబడి కోసం షేర్లను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచు కోవాలి..

  • వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల షేర్లు అందుబాటు ధరలోకి వచ్చినప్పుడల్లా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి.
  • లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న సంస్థలను పరిశీలిస్తూ ఉండాలి.
  • ఇప్పటికే మంచి పనితీరు చూపించినవీ, అనిశ్చితిలోనూ స్థిరంగా ఉన్న వాటిని చూడాలి.
  • ఆయా రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీలను గమనిస్తూ ఉండాలి. అందుబాటు ధరలోకి వచ్చాయనుకున్నప్పుడు పోర్ట్‌ఫోలియోలో స్థానం కల్పించాలి.
  • లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లలో ఆకర్షణీయంగా ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలి. నష్టభయం భరించే సామర్థ్యం ఇక్కడ కీలకం.
  • వినియోగం, ఎగుమతులు ఈ రెండింటిలోనూ ఉన్న కంపెనీలపై దృష్టి సారించాలి.

కోటక్‌ సెక్యూరిటీస్‌

కెనరా బ్యాంక్‌, సిప్లా, సైయెంట్‌, దాల్మియా భారత్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌, మైక్రోటెక్‌ డెవలపర్స్‌, పీసీబీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

షేర్‌ఖాన్‌

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ ఫోర్జ్‌, బిర్లా సాఫ్ట్‌, బీఎస్‌ఈ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌, గర్వారే హై-టెక్‌ ఫిల్మ్స్‌, గోకల్‌దాస్‌ ఏరోనాటిక్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కిర్లోస్కర్‌ ఆయిల్‌ ఇంజిన్స్‌, కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌, లార్సన్‌ అండ్‌ టూబ్రో, సనోఫీ ఇండియా, టాటా మోటర్స్‌, వండర్లా హాలిడేస్‌

చోళా సెక్యూరిటీస్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, పూనావాలా ఫిన్‌కార్ప్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌, జేబీఎం ఆటో, డీఎల్‌ఎఫ్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌

ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పాలిక్యాబ్‌ ఇండియా, కల్యాణ్‌ జ్యువెలర్స్‌ ఇండియా, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, టిటాగఢ్‌ రైల్‌ సిస్టమ్స్‌, బెక్టార్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌, కోల్టే పాటిల్‌ డెవలపర్స్‌, గుడ్‌లక్‌ ఇండియా

ఐడీబీఐ క్యాపిటల్‌

బిర్లా సాఫ్ట్‌ లిమిటెడ్‌, కజారియా సిరామిక్స్‌, మైక్రోటెక్‌ డెవలపర్స్‌, నారాయణ హృదయాలయ, టాటా పవర్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

జేఎం ఫైనాన్షియల్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, లార్సన్‌ అండ్‌ టూబ్రో, టైటన్‌, సన్‌ ఫార్మా, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌, అశోక్‌ లేల్యాండ్‌, కోఫోర్జ్‌, ఎస్‌జేవీఎన్‌, సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా, గో ఫ్యాషన్‌ ఇండియా, స్టైలామ్‌ ఇండస్ట్రీస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని