ఇంటికి అంబులెన్స్‌.. ఆసుపత్రిలో పడక

కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో అన్ని వయస్సుల వాళ్లకు ఉపయోగపడేలా పలు ఆరోగ్య పథకాలను ఆరోగ్య సంరక్షణ సంస్థ ఆక్సీ అందుబాటులోకి తెచ్చింది. తక్షణమే ఇంటివద్దకు అంబులెన్స్‌ పంపేందుకు సహకరిస్తామనీ

Updated : 06 Aug 2021 04:34 IST

వయస్సు, వ్యాధులతో సంబంధం  లేకుండా ఆరోగ్య పథకాలు: ఆక్సీ

దిల్లీ: కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో అన్ని వయస్సుల వాళ్లకు ఉపయోగపడేలా పలు ఆరోగ్య పథకాలను ఆరోగ్య సంరక్షణ సంస్థ ఆక్సీ అందుబాటులోకి తెచ్చింది. తక్షణమే ఇంటివద్దకు అంబులెన్స్‌ పంపేందుకు సహకరిస్తామనీ చెబుతోంది. దేశవ్యాప్తంగా 2,00,000కి పైగా ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల (డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్స్‌) నెట్‌వర్క్‌ ఆక్సీకి ఉంది. వైద్యులు, నర్సులు, ఔషధాలతో పాటు అవసరమైతే ఆక్సిజన్‌, ఆసుపత్రుల పడక లభ్యతకూ ఆక్సీ సహకారం అందించనుంది. ఆరోగ్య బీమా మాదిరి కాకుండా అన్ని వయస్సుల వారికి, ఇప్పటికే ఏమైనా వ్యాధులతో బాధపడుతున్నారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఈ సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఏ కుటుంబమైనా చెల్లించగలిగే స్థాయిలోనే తమ పథకాల ప్రీమియం ఉంటుందని ఆక్సీ హెల్త్‌కేర్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శీతల్‌ కపూర్‌ తెలిపారు. కంటి, దంత సంరక్షణ సేవలు కూడా ఈ ఆరోగ్య పథకాల్లో భాగంగా ఉన్నాయని, సాధారణంగా బీమా పాలసీల్లో ఇటువంటివి చేర్చడం చాలా అరుదు అని ఆయన అన్నారు. ‘కొవిడ్‌-19 రెండో దశలో ఎంతో మంది తమ కుటుంబీకులను, మిత్రులను కోల్పోయారు. ఆసుపత్రులు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ఆరోగ్య బీమాను ఆసుపత్రులు అంగీకరించని సందర్భాలూ ఉన్నాయి. అందువల్లే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రతి ఒక్కరికీ సులువుగా, అందుబాటు ధరకే అందేలా చేసేందుకు మేం ఈ పథకాలను తీసుకొచ్చామ’ని ఆక్సీ డైరెక్టర్‌ పంకజ్‌ గుప్తా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని