రికార్డు స్థాయిలో విదేశీ మారకపు నిల్వలు

విదేశీ మారకపు నిల్వలు తాజా జీవనకాల గరిష్ఠానికి చేరాయి. జులై 30తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో 9.427 బిలియన్‌ డాలర్లు పెరిగి జీవనకాల..

Published : 07 Aug 2021 05:06 IST

ముంబయి: విదేశీ మారకపు నిల్వలు తాజా జీవనకాల గరిష్ఠానికి చేరాయి. జులై 30తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో 9.427 బిలియన్‌ డాలర్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 620.576 బిలియన్‌ డాలర్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. జులై 23తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 1.581 బిలియన్‌ డాలర్లు పెరిగి 611.149 బిలియన్‌ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. జులై 30తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 8.596 బిలియన్‌ డాలర్లు పెరిగి 576.224 బిలియన్‌ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు 760 మిలియన్‌ డాలర్లు పెరిగి 37.644 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 6 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.552 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఐఎంఎఫ్‌లో దేశ నిల్వల స్థానం 65 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.156 బిలియన్‌ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని