నాణ్యమైన సేవలకు కట్టుబడి ఉన్నాం

వినియోగదారులకు నాణ్యమైన సేవలు, అద్భుత ప్రమాణాలతో అందించడం కొనసాగిస్తామని వొడాఫోన్‌ ఐడియా సీఈఓ రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు. రెండు సంస్థల విలీనంతో ఏర్పడిన ‘వి’ బ్రాండ్‌ ఏడాది

Published : 14 Aug 2021 01:56 IST

వినియోగదారులకు వొడాఫోన్‌ ఐడియా సీఈఓ లేఖ

దిల్లీ: వినియోగదారులకు నాణ్యమైన సేవలు, అద్భుత ప్రమాణాలతో అందించడం కొనసాగిస్తామని వొడాఫోన్‌ ఐడియా సీఈఓ రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు. రెండు సంస్థల విలీనంతో ఏర్పడిన ‘వి’ బ్రాండ్‌ ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన ఖాతాదారులకు లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్‌ భారత్‌ కోసం మంచి టెక్నాలజీ, సేవలు, సొల్యూషన్లు అందించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు హామీ ఇస్తూ ‘వి’ ప్రస్థానం మొదలైందని అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించలేదు. గత ఏడాదికాలంలో కరోనా సంక్షోభం మానవ జాతి స్ఫూర్తిని పరీక్షించిందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలోనే భారత్‌లో అత్యంత చిన్న వయసు కలిగిన టెలికాం బ్రాండ్‌ ‘వి’ ఆవిర్భవించి, ఏడాది కంటే తక్కువ సమయంలో ప్రజల అభిమానాన్ని సంపాదించిందని టక్కర్‌ అన్నారు.


25% పెరిగిన గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ లాభం

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ రూ.101 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.81 కోట్లతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.397 కోట్ల నుంచి రూ.525 కోట్లకు పెరిగింది. ‘స్టాక్‌మార్కెట్లలో కంపెనీ నమోదు (లిస్టింగ్‌) తర్వాత తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించాం. కొవిడ్‌ మహమ్మారి రెండో దశ ఉద్ధృతితో ఎన్నో సవాళ్లు ఎదురైనా, మా సేవలు, కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకున్నాం. బలమైన వృద్ధితో 2021-22లో శుభారంభం చేశామ’ని గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎండీ, సీఈఓ యాసిర్‌ రజ్వీ వెల్లడించారు.
* బీఎస్‌ఈలో షేరు 0.78 శాతం లాభంతో రూ.757.75 వద్ద ముగిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని