నెక్స్ట్‌వేవ్‌.టెక్‌కు రూ.21 కోట్ల పెట్టుబడులు

ఎడ్యుటెక్‌ అంకురం నెక్స్ట్‌వేవ్‌.టెక్‌ సుమారు రూ.21 కోట్ల (2.8 మిలయన్‌ డాలర్లు) పెట్టుబడిని సమీకరించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రీ-సిరీస్‌ ఫండింగ్‌ దశలో భాగంగా ఓరియస్‌ వెంచర్‌

Published : 01 Dec 2021 01:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎడ్యుటెక్‌ అంకురం నెక్స్ట్‌వేవ్‌.టెక్‌ సుమారు రూ.21 కోట్ల (2.8 మిలయన్‌ డాలర్లు) పెట్టుబడిని సమీకరించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ప్రీ-సిరీస్‌ ఫండింగ్‌ దశలో భాగంగా ఓరియస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌, బెటర్‌ క్యాపిటల్‌ నేతృత్వంలో ఈ నిధులను పొందింది. వీటితోపాటు కార్‌దేఖో సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్‌ కుమార్‌, షాదీ.కామ్‌ వ్యవస్థాపకుడు అనుపమ్‌ మిత్తల్‌, బ్రైట్‌ఛాంప్స్‌ వ్యవస్థాపకుడు రవి భూషణ్‌, లివ్‌స్పేస్‌ వ్యవస్థాపకుడు రమాకాంత్‌ శర్మ తదితరులూ ఈ పెట్టుబడిలో భాగస్వాములయ్యారు. ఐఐటీల్లో చదివిన శశాంక్‌ రెడ్డి గుజ్జాల, అనుపమ్‌ పెదర్ల, రాహుల్‌ అట్లూరి ఈ సంస్థను ప్రారంభించారు. విద్యార్థులకు 4.0 సాంకేతికతలపై పట్టు పెంచేందుకు నెక్స్ట్‌వేవ్‌ శిక్షణ ఇస్తోంది. ఏడాదికి 10లక్షల మందిని ఈ కొత్త సాంకేతికతల కోసం సిద్ధం చేసే లక్ష్యంతో పనిచేస్తోందని సీఈఓ రాహుల్‌ అట్లూరి తెలిపారు. చిన్న పట్టణాల్లోని విద్యార్థులే లక్ష్యంగా ఆంగ్లంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భాషల్లో శిక్షణ ప్రారంభిస్తామని తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో ప్రారంభించినప్పటి నుంచి 2లక్షల మందికి పైగా పలు కోర్సుల్లో చేరారని వెల్లడించారు. గత పది నెలల్లో సంస్థ ఆదాయం 9 రెట్లు పెరిగిందని, ఏఆర్‌ఆర్‌ సుమారు రూ.56 కోట్లుగా ఉందన్నారు. రాబోయే 12 నెలల్లో సంస్థ ఆదాయం 5 రెట్ల వరకు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని