Parag Agarwal: ట్విటర్‌ కొత్త సీఈఓ పరాగ్‌ వేతనమెంతో తెలుసా?

ట్విటర్‌ సీఈఓగా ఎన్నికైన పరాగ్‌ అగర్వాల్‌కు 1 మిలియన్‌ డాలర్ల (రూ.7.5 కోట్లు) వార్షిక వేతనం లభిస్తుందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. ఇదికాక బోనస్‌లు, పరిమిత స్టాక్‌ యూనిట్లు

Updated : 02 Dec 2021 15:22 IST

న్యూయార్క్‌:  ట్విటర్‌ సీఈఓగా ఎన్నికైన పరాగ్‌ అగర్వాల్‌కు 1 మిలియన్‌ డాలర్ల (రూ.7.5 కోట్లు) వార్షిక వేతనం లభిస్తుందని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. ఇదికాక బోనస్‌లు, పరిమిత స్టాక్‌ యూనిట్లు; పనితీరు ఆధారిత షేర్లు (12.5 మిలియన్‌ డాలర్లు- సుమారు రూ.94 కోట్లు) అదనంగా పొందుతారు. ట్విటర్‌లో చేరినప్పటి నుంచీ అన్నిటా కీలకంగా మారి, 2017లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా ఒక మెట్టు ఎక్కిన పరాగ్‌.. తాజాగా సీఈఓ స్థానాన్ని అధిరోహించారు. పరాగ్‌ తండ్రి బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌)లో ఉద్యోగి. ఆయన పాఠశాల విద్య ముంబయిలోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో సాగింది. తదుపరి అటామిక్‌ ఎనర్జీ జూనియర్‌ కళాశాలలో 1999-2001 సంవత్సరాలో క్లాస్‌ 11, 12 చదివారు. ఐఐటీలో సీటు సాధించాలనే తపనతో సైన్స్‌, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అభ్యసించారని కాలేజీ ప్రిన్సిపల్‌ తెలిపారు.  ఐఐటీ బాంబేలో 2005లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పట్టా పొందిన అగర్వాల్‌ను ఐఐటీ బాంబే ఈ సందర్భంగా అభినందించింది. తన గ్రాడ్యుయేషన్‌లో ఆయన రజత పతకాన్ని పొందినట్లు వెల్లడించింది. అనంతరం అమెరికాకు వెళ్లిన పరాగ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2011లో ట్విటర్‌లో చేరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని