భారత్‌లో 100 నగరాలకు 3డీ మ్యాప్‌

దేశవ్యాప్తంగా ఉన్న అగ్రగామి 100 నగరాలకు చెందిన 3డీ మ్యాప్‌ సిద్ధం చేయాలని టెక్నాలజీ సంస్థ జెనిసిస్‌ భావిస్తోంది. వినియోగదార్లు, కంపెనీలకు లైసెన్స్‌ పద్ధతిలో...

Published : 02 Dec 2021 01:59 IST

ప్రణాళికలో జెనిసిస్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న అగ్రగామి 100 నగరాలకు చెందిన 3డీ మ్యాప్‌ సిద్ధం చేయాలని టెక్నాలజీ సంస్థ జెనిసిస్‌ భావిస్తోంది. వినియోగదార్లు, కంపెనీలకు లైసెన్స్‌ పద్ధతిలో ఆ మ్యాప్‌లను సంస్థ అందిస్తుంది. ఎపుడు మ్యాపింగ్‌ పూర్తవుతుందన్న విషయాన్ని వెల్లడించలేదు కానీ.. 18 నెలల్లోగా 100 నగరాలకు సంబంధించిన ప్రాజెక్టును పూర్తి చేసే సామర్థ్యం తమకు ఉందని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాజిద్‌ మాలిక్‌ పేర్కొన్నారు. ‘3డీ మ్యాపింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఇప్పటిదాకా రూ.200 కోట్లు వెచ్చించాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజలకు ఇవి అందుబాటులోకి వస్తాయి. పాక్షికంగా ఉచితంగా, పాక్షికంగా చెల్లింపులు చేసేలా ‘ఫ్రీమియం’ నమూనాలో వీటిని తీసుకొస్తామ’ని ఆయన వివరించారు. కంపెనీకి చెందిన మ్యాపింగ్‌ ప్లాట్‌ఫాం ‘డిజిటల్‌ ట్విన్‌’ను నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ గతంలో ఆవిష్కరించారు ప్రభుత్వం ప్రకటించిన కొత్త జియోస్పేషియల్‌ విధానం రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులను తీసుకురానుందని మాలిక్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని