అట్లాస్‌ క్యాప్‌కో చేతికి హెచ్‌హెచ్‌వీ పంప్స్‌

వ్యాక్యూమ్‌ పంప్‌ల ఉత్పత్తిలో దేశీయ అగ్రగామి కంపెనీ హెచ్‌హెచ్‌వీ పంప్స్‌లో 100 శాతం వాటాను స్వీడన్‌ సంస్థ అట్లాస్‌ క్యాప్‌కో కొనుగోలు చేసింది. 2009లో ఏర్పాటై, 150 మంది ఉద్యోగులున్న హెచ్‌హెచ్‌వీ పంప్స్‌ ఉత్పత్తులను ఫార్మాస్యూటికల్స్‌, రసాయనాలు, విద్యుత్తు, రిఫ్రిజరేషన్‌,

Updated : 03 Dec 2021 03:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాక్యూమ్‌ పంప్‌ల ఉత్పత్తిలో దేశీయ అగ్రగామి కంపెనీ హెచ్‌హెచ్‌వీ పంప్స్‌లో 100 శాతం వాటాను స్వీడన్‌ సంస్థ అట్లాస్‌ క్యాప్‌కో కొనుగోలు చేసింది. 2009లో ఏర్పాటై, 150 మంది ఉద్యోగులున్న హెచ్‌హెచ్‌వీ పంప్స్‌ ఉత్పత్తులను ఫార్మాస్యూటికల్స్‌, రసాయనాలు, విద్యుత్తు, రిఫ్రిజరేషన్‌, ఎయిర్‌ కండీషనింగ్‌ తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన అట్లాస్‌ క్యాప్‌కో సారథ్యంలో, తన ఛానల్‌ భాగస్వాములతో కలిసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే అవకాశం కలుగుతుందని హెచ్‌హెచ్‌వీ పంప్స్‌ ఎండీ శ్రీధర్‌ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని స్టాండర్డ్‌ గ్యాస్‌ లైనింగ్‌ టెక్నాలజీకి అనుబంధంగా ఉన్న ఎస్‌2 ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీకి చెందిన స్టాన్‌పంప్స్‌ అనే వ్యాక్యూమ్‌ డివిజన్‌, హెచ్‌హెచ్‌వీ పంప్స్‌కు ప్రధాన ఛానల్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఔషధ, రసాయనాలు, వ్యవసాయ రసాయనాల పరిశ్రమలకు దేశవ్యాప్తంగా వ్యాక్యూమ్‌ పంపులను సరఫరా చేస్తున్నామని, ఈ విభాగం ఏటా 50 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని స్టాండర్డ్‌ గ్లాస్‌ గ్రూప్‌ ఎండీ కె.నాగేశ్వరరావు వివరించారు. తమ గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ రూ.550 కోట్లని తెలిపారు. అట్లాస్‌ క్యాప్‌కో, హెచ్‌హెచ్‌వీ భాగస్వామ్యం వల్ల తాము పంపిణీ చేసే వ్యాక్యూమ్‌ ఉత్పత్తుల శ్రేణి విస్తరిస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని