దేశీయ తొలి సర్వర్‌ ‘రుద్ర’ ఆవిష్కరణ

దేశీయంగా ఆవిష్కరించిన తొలి  సర్వర్‌ ‘రుద్ర’ను ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. దీనిని నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌(ఎన్‌ఎస్‌ఎమ్‌) కింద సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌

Published : 04 Dec 2021 01:36 IST

దిల్లీ: దేశీయంగా ఆవిష్కరించిన తొలి  సర్వర్‌ ‘రుద్ర’ను ఎలక్ట్రానిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. దీనిని నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌(ఎన్‌ఎస్‌ఎమ్‌) కింద సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సి-డాక్‌) అభివృద్ధి చేసింది. ఈ సర్వర్‌ డిజైన్‌ను సంప్రదాయ వాణిజ్య సర్వర్ల తయారీకీ వినియోగించుకోవచ్చు. అత్యంత భారీ కంప్యూటింగ్‌ పనితీరును ప్రదర్శించే పెద్ద సూపర్‌కంప్యూటింగ్‌ వ్యవస్థల నిర్మాణంలోనూ వాడుకోవచ్చు. ‘దేశ కంప్యూటింగ్‌ అవసరాలకు అనుగుణంగా డిజైన్‌ చేసి, అభివృద్ధి పరచి, సర్వర్లను నిర్మించగల సత్తా భారత్‌కు ఉందని దీంతో నిరూపితమైంద’ని ఐటీ శాఖ పేర్కొంది. తాజాగా ఆవిష్కరించిన ఈ సొంత సర్వర్‌ నుంచి అధిక పనితీరును కనబరిచే కంప్యూటింగ్‌ (హెచ్‌పీసీ) సిస్టమ్స్‌, హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్స్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, బ్యాంకింగ్‌ అండ్‌ కామర్స్‌, తయారీ, చమురు-గ్యాస్‌ పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ వంటి వేర్వేరు రంగాలు ప్రయోజనం పొందనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని