బెంగళూరులో నెస్లేఅంతర్జాతీయ ఐటీ సేవల కేంద్రం

స్విట్జర్లాంట్‌ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఎస్‌ఏ బెంగళూరులో అంతర్జాతీయ ఐటీ సేవల కేంద్రాన్ని ప్రారంభించింది. ఆసియా, ఓషియానా, ఆఫ్రికాలలోని 45కు పైగా దేశాల్లో ఉన్న తమ సంస్థలకు...

Published : 08 Dec 2021 02:22 IST

దిల్లీ: స్విట్జర్లాంట్‌ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఎస్‌ఏ బెంగళూరులో అంతర్జాతీయ ఐటీ సేవల కేంద్రాన్ని ప్రారంభించింది. ఆసియా, ఓషియానా, ఆఫ్రికాలలోని 45కు పైగా దేశాల్లో ఉన్న తమ సంస్థలకు ఈ కేంద్రం నుంచి తోడ్పాటు అందించనుంది. 2022 చివరికి నెస్లే గ్లోబల్‌ సర్వీసెస్‌ ఇండియా పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ హబ్‌ల నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతుందని తెలిపింది. నెస్లే గ్లోబల్‌ సర్వీసెస్‌ ఇండియా ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడి వివరాలను సంస్థ ప్రకటించలేదు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన 150 మందితో కూడా ప్రత్యేక ఐటీ టీమ్‌ ఈ కేంద్రంలో ఉంటుందని నెస్లే ఎస్‌ఏ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని