బీఎమ్‌డబ్ల్యూ నుంచి విద్యుత్‌ ఎస్‌యూవీ

జర్మనీ వాహన తయారీ దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ పూర్తి స్థాయి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘ఐఎక్స్‌’ను భారత్‌లో ఆవిష్కరించింది. రాబోయే 6 నెలల్లో మన దేశంలోకి విడుదల చేయబోయే మూడు విద్యుత్‌ వాహనాల్లో ఇది

Published : 14 Dec 2021 03:15 IST

ప్రారంభ ధర రూ.1.16 కోట్లు

దిల్లీ: జర్మనీ వాహన తయారీ దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ పూర్తి స్థాయి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘ఐఎక్స్‌’ను భారత్‌లో ఆవిష్కరించింది. రాబోయే 6 నెలల్లో మన దేశంలోకి విడుదల చేయబోయే మూడు విద్యుత్‌ వాహనాల్లో ఇది మొదటిది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు. పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన వాహనం(సీబీయూ)గా ఈ కారును దిగుమతి చేసుకుంటారు. బీఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా వీటిని బుక్‌ చేసుకోవచ్చని,  2022 ఏప్రిల్‌ నుంచి డెలివరీలు మొదలవుతాయని సంస్థ తెలిపింది.

ఇవీ ప్రత్యేకతలు..

ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ వాహనం(ఎస్‌ఏవీ-స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌)గా ఇది వస్తోంది. రెండు విద్యుత్తు మోటార్‌లతో నడిచే ఈ కారు 6.1 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
ప్రారంభ ఆఫర్‌ కింద స్మార్ట్‌ బీఎమ్‌డబ్ల్యూ వాల్‌బాక్స్‌ ఛార్జర్‌ ఉచితంగా ఇస్తున్నారు. 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో ఇంటిదగ్గర 7 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ అవుతుంది. 2.5 గంటల ఛార్జింగ్‌తో 100 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.
150 కి.వా. డీసీ ఛార్జర్‌ ద్వారా 31 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జి అవుతుంది. 10 నిమిషాల్లో 95 కి.మీ. ప్రయాణించవచ్చు.
50 కి.వా. డీసీ ఛార్జర్‌ ద్వారా 80 శాతం ఛార్జింగ్‌కు 73 నిమషాలు; 100 కి.మీ.ప్రయాణానికి 21 నిమిషాల సమయం అవుతుంది.
దేశంలోని 35 నగరాల్లో తన డీలర్‌ నెట్‌వర్క్‌ వద్ద ఫాస్ట్‌ ఛార్జర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

వారంటీ ఇదీ..: కిలోమీటర్లతో సంబంధం లేకుండా కారుకు రెండేళ్ల వరకు వారెంటీ ఇస్తారు. ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. వరకు బ్యాటరీలకు వారెంటీ ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని