కార్డుల టోకనైజేషన్‌ గడువు జూన్‌ 30

డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల టోకనైజేషన్‌ పద్ధతికి మారేందుకు ఆర్థిక సంస్థలకు గడువును మరో 6 నెలల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పొడిగించింది. వాస్తవానికి డిసెంబరు 31తో గడువు ముగియనుండగా.. 

Published : 24 Dec 2021 03:21 IST

ఆరు నెలలు పొడిగించిన ఆర్‌బీఐ

ముంబయి:  డెబిట్‌/ క్రెడిట్‌ కార్డుల టోకనైజేషన్‌ పద్ధతికి మారేందుకు ఆర్థిక సంస్థలకు గడువును మరో 6 నెలల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పొడిగించింది. వాస్తవానికి డిసెంబరు 31తో గడువు ముగియనుండగా.. 2022 జూన్‌ 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. టోకనైజేషన్‌ నిబంధనలకు మారేందుకు బ్యాంకులు సన్నద్ధతతో ఉన్నప్పటికీ.. చిన్న సంస్థలు, వ్యాపారులు సిద్ధంగా లేరనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గడువు పొడిగింపు అంశంపై యోచన చేయాల్సిందిగా బ్యాంకులు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ప్రతినిధులు ఆర్‌బీఐకి విడివిడిగా లేఖలు రాశారు. మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌, స్పాటిఫై, బుక్‌మై షో, డిస్నీ+హాట్‌స్టార్‌ వంటి సంస్థలకు సభ్యత్వం ఉన్న మర్చంట్‌ పేమెంట్స్‌ అలయన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎంపీఏఐ), పేటీఎం, మ్యాట్రిమొనీ.కామ్‌, మ్యాప్‌మై ఇండియాలు సభ్యులుగా ఉన్న అలయన్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఏడీఐఎఫ్‌) కూడా ఆర్‌బీఐను ఇదే విషయంపై కోరుతూ వచ్చాయి. ఈ వినతులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గడువు పొడిగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని