మదుపర్ల సంపద రూ.280 లక్షల కోట్లకు

వాహన, ఇంధన, ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూల ఐరోపా సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి.డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 74.25 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

Published : 18 Jan 2022 02:18 IST

సమీక్ష
వాహన, ఇంధన షేర్ల జోరు

వాహన, ఇంధన, ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సానుకూల ఐరోపా సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి.డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 74.25 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

* సూచీలు లాభపడటంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ తాజా రికార్డు గరిష్ఠమైన రూ.280.02 లక్షల కోట్లకు చేరింది.

* సెన్సెక్స్‌ ఉదయం 61,219.64 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. డీలాపడిన సూచీ.. ఇంట్రాడేలో 61,107.60 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కోలుకుని లాభాల్లోకి వచ్చి 61,385.48 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 85.88 పాయింట్ల లాభంతో 61,308.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 52.35 పాయింట్లు పెరిగి 18,308.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 18,228.75- 18,321.55 పాయింట్ల మధ్య కదలాడింది.

* డిసెంబరు త్రైమాసికంలో లాభం 13.6% తగ్గడంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు కుదేలైంది. ఇంట్రాడేలో 6.99% పడ్డ షేరు రూ.1244 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 5.89% నష్టంతో రూ.1258.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.21,369.84 కోట్లు తగ్గి రూ.3,41,596 కోట్లకు పరిమితమైంది.

* విద్యుత్‌ ద్విచక్రవాహన కంపెనీ అథర్‌ ఎనర్జీలో రూ.420 కోట్లు పెట్టనున్నట్లు ప్రకటించడంతో హీరో మోటోకార్ప్‌ షేరు 5.11 శాతం లాభంతో రూ.2701.85 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ 2.78%, ఎం అండ్‌ ఎం 2.19%, మారుతీ 2.08%, టాటా స్టీల్‌ 1.35%, టీసీఎస్‌ 1.26%, ఎల్‌ అండ్‌ టీ 1.20%, ఎస్‌బీఐ 1.14%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.09%, హెచ్‌యూఎల్‌  1.04%, ఎన్‌టీపీసీ 1.03% మెరిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.53%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.25%, టెక్‌ మహీంద్రా 1.01% చొప్పున నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో వాహన, యుటిలిటీస్‌, విద్యుత్‌, స్థిరాస్తి, మన్నికైన వినిమయ వస్తువులు 1.98 శాతం వరకు పెరిగాయి. ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ తగ్గాయి. బీఎస్‌ఈలో 2297 షేర్లు లాభపడగా, 1308 స్క్రిప్‌లు నష్టపోయాయి. 134 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని