నిధులు సమీకరించే యోచనలో సైయెంట్‌?

హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌, ఐటీ, డిజైన్‌ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ తన విస్తరణ అవసరాల కోసం నిధులు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీ సత్వర అభివృద్ధికి దోహదపడే ఇతర వ్యాపార సంస్థలను కొనుగోలు

Published : 25 Jan 2022 02:41 IST

ఈనాడు, హైదరాబాద్‌:  హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌, ఐటీ, డిజైన్‌ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ తన విస్తరణ అవసరాల కోసం నిధులు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీ సత్వర అభివృద్ధికి దోహదపడే ఇతర వ్యాపార సంస్థలను కొనుగోలు చేయాలని (ఇన్‌-ఆర్గానిక్‌ గ్రోత్‌), అందుకు కొంతమేరకు నిధులు సమకూర్చుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. సైయెంట్‌ లిమిటెడ్‌కు ప్రస్తుతం అప్పు లేదు. దీనికి తోడు సమీప భవిష్యత్తులో మంచి వృద్ధి నమోదు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. అందువల్ల వ్యూహాత్మకంగా కొన్ని సంస్థలను కొనుగోలు చేసి, ఇంకా అభివృద్ధి పథంలో నిలవాలనేది కంపెనీ యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. దీనికితోడు సంస్థాగతంగా పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని, అప్రధాన వ్యాపార విభాగాలను, అనుబంధ సంస్థలను విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని