యునిలీవర్‌లో 1500 మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాల్లో కోత

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ యునిలీవర్‌లో సంస్థాగతంగా జరుగుతున్న మార్పుల వల్ల 1500 మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలకు కోత పడనుంది. విభాగాల వారీగా మరింతగా దృష్టి కేంద్రీకరించేలా, సంస్థను పునర్‌

Published : 26 Jan 2022 03:53 IST

సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ఫలితం

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ యునిలీవర్‌లో సంస్థాగతంగా జరుగుతున్న మార్పుల వల్ల 1500 మేనేజ్‌మెంట్‌ ఉద్యోగాలకు కోత పడనుంది. విభాగాల వారీగా మరింతగా దృష్టి కేంద్రీకరించేలా, సంస్థను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నందున జూనియర్‌, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో పలు పోస్టులు గల్లంతవుతాయని కంపెనీ మంగళవారం తెలిపింది. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో 15 శాతం, జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో 5 శాతం పోస్టులు తొలగుతాయని, ఇందువల్ల అంతర్జాతీయంగా 1500 పోస్టులు తగ్గిపోతాయని వివరించింది. ప్రస్తుత వ్యవస్థ స్థానంలో 5 భిన్న వ్యాపార సమూహాలను ‘వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ, బ్యూటీ-వెల్‌బీయింగ్‌, న్యూట్రిషన్‌, ఐస్‌క్రీమ్‌’ వారీగా ఏర్పాటు చేస్తామని సంస్థ వెల్లడించింది. తమ విభాగాలకు సంబంధించిన వ్యూహాలు, వృద్ధి, లాభార్జన బాధ్యత ఆయా వ్యాపార బృందాలదే అవుతుందని సంస్థ పేర్కొంది. ఈ 5 విభాగాలకు యునిలీవర్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ సహకరిస్తుందని, టెక్నాలజీ- సిస్టమ్స్‌ - ప్రాసెసెస్‌ సమకూరుస్తుందని వివరించింది. ఇందులో భాగంగా పలు ఉన్నతస్థాయి పోస్టులలో మార్పులు చేసి, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని