
విద్యుత్ ద్విచక్ర వాహనాలపై కైనెటిక్ గ్రీన్ రూ.100 కోట్ల పెట్టుబడులు
ముంబయి: విద్యుత్ ద్విచక్ర వాహనాల అభివృద్ధి కోసం కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్, చైనాకు చెందిన ఈవీ దిగ్గజం ఐమా టెక్నాలజీ గ్రూప్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ ప్రాజెక్టులో కైనెటిక్ గ్రీన్ రూ.80-100 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు-సీఈఓ సలజ్జ ఫిరోడియా మోత్వానీ వెల్లడించారు. ఈ ఏడాదే 3 కొత్త మోడళ్లను విపణిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. పుణెకు చెందిన కైనెటిక్ గ్రీన్ గత ఏడాదే విద్యుత్తు ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించి, జింగ్, జూమ్ అనే రెండు స్కూటర్లను ఆవిష్కరించింది. ‘విద్యుత్ వాహన వ్యాపారంలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలున్నాయి. సామర్థ్య సృష్టి, ప్రోడక్ట్ అభివృద్ధి, మార్కెట్ వ్యాప్తి తదితర విభాగాల్లో వచ్చే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులు పెట్టబోతున్నాం. ఐమా టెక్నాలజీ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఈ నిర్దిష్ట ప్రాజెక్టులో రూ.80-100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామ’ని మోత్వానీ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.