Forbes:సమాజసేవకు ఫోర్బ్స్‌ గుర్తింపు

ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితా-2022లో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులకు చోటు దక్కింది. కోదాడకు చెందిన సందీప్‌ శర్మ, చిత్తూరు కొత్తకోటకు చెందిన అనిల్‌ కుమార్‌ రెడ్డి ఈ సంస్థను ప్రారంభించారు. ఇద్దరూ ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌లో చదువుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన సారంగ్‌ బోబాడే ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఫోర్బ్స్‌ ‘ఎన్‌జీఓలు-సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ విభాగంలో వీరు ఎంపికయ్యారు. ఈ

Updated : 08 Feb 2022 04:18 IST

ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30లో డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు

ఈనాడు, హైదరాబాద్‌: ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితా-2022లో హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులకు చోటు దక్కింది. కోదాడకు చెందిన సందీప్‌ శర్మ, చిత్తూరు కొత్తకోటకు చెందిన అనిల్‌ కుమార్‌ రెడ్డి ఈ సంస్థను ప్రారంభించారు. ఇద్దరూ ఎన్‌ఐటీ నాగ్‌పుర్‌లో చదువుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన సారంగ్‌ బోబాడే ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఫోర్బ్స్‌ ‘ఎన్‌జీఓలు-సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ విభాగంలో వీరు ఎంపికయ్యారు. ఈ ముగ్గురి వయసూ 26 ఏళ్లే. స్వచ్ఛంద సంస్థలు, వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునే దాతలకూ మధ్య ఈ సంస్థ వారధిలాగా పనిచేస్తుంది. ఎవరైనా ఒక సమస్యతో ఎన్‌జీఓలను ఆశ్రయించినప్పుడు, వారి అభ్యర్థన మేరకు ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపడుతుంది. ‘ఈ సంస్థను 2017 మార్చిలో ప్రారంభించాం. ఇప్పటివరకు రూ.150 కోట్ల విలువైన విరాళాలను సేకరించి, ఎన్‌జీఓలకు అందించాం. కొవిడ్‌ తొలి దశలో సొంతూళ్లకు వెళ్తున్న వలస కూలీలకు నిత్యావసరాలను అందించాం. రెండో దశలో ఆక్సిజన్‌ సిలిండర్లు విరాళాలుగా వచ్చాయి. రెండేళ్లలోనే రూ.120 కోట్ల విరాళాలను సేకరించాం. వృద్ధాశ్రమాలు, శిశు సంరక్షణ కేంద్రాలకు ఎక్కువగా విరాళాలు అందుతున్నాయి. దాదాపు 10 లక్షల మందికి పైగా దాతలు మా ద్వారా విరాళాలు అందిస్తున్నారు. మా ఆన్‌లైన్‌ వేదికపై ఉన్న వస్తువులను ఎంచుకుని, వాటిని అవసరమైన వారికి అందించొచ్చు’ అని సందీప్‌, అనిల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితాలో పేరు సంపాదించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొత్తం 65 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. ఫోర్బ్స్‌ జాబితాలో ఈ సంస్థ పేరు సంపాదించడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. టి-హబ్‌ సైతం తమ ల్యాబ్‌ 32లో భాగమైన డొనేట్‌కార్ట్‌ వ్యవస్థాపకులు ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని