ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ రూ.231 కోట్లు పంపిణీ

రద్దు చేసిన 6 డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల యూనిట్‌ హోల్డర్లకు రూ.231.13 కోట్ల నగదు పంపిణీ చేయనున్నామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) ప్రై.లి. ప్రెసిడెంట్‌ సంజయ్‌ సాప్రే

Updated : 05 Apr 2022 05:37 IST

దిల్లీ: రద్దు చేసిన 6 డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల యూనిట్‌ హోల్డర్లకు రూ.231.13 కోట్ల నగదు పంపిణీ చేయనున్నామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఇండియా) ప్రై.లి. ప్రెసిడెంట్‌ సంజయ్‌ సాప్రే సోమవారం వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ 6 పథకాల్లో మదుపు చేసిన వారికి రూ.26,098 కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరిలో రూ.9,122 కోట్లు, ఏప్రిల్‌లో రూ.2,962 కోట్లు, మేలో రూ.2,489 కోట్లు, జూన్‌లో రూ.3,205 కోట్లు, జులైలో రూ.3,303 కోట్లు, సెప్టెంబరులో రూ.2,918 కోట్లు, నవంబరులో రూ.1,115 కోట్ల చొప్పున పంపిణీ చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని