రుచి సోయాకు.. పతంజలి ఆయుర్వేద్‌ ఆహార వ్యాపారం

బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్‌ తన ఆహార రిటైల్‌ వ్యాపారాన్ని గ్రూప్‌నకే చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్‌కు విక్రయించనుంది.

Published : 19 May 2022 02:42 IST

దిల్లీ: బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద్‌ తన ఆహార రిటైల్‌ వ్యాపారాన్ని గ్రూప్‌నకే చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్‌కు విక్రయించనుంది. ఆహారేతర, సంప్రదాయ వైద్యం, వెల్‌నెస్‌ వ్యాపారాలపై దృష్టి పెట్టే వ్యూహంలో భాగంగా రూ.690 కోట్లకు ఈ అమ్మకాన్ని చేపట్టనుంది. పతంజలికి చెందిన ఆహార రిటైల్‌ వ్యాపారంలో కొన్ని ఆహార పదార్థాల తయారీ, ప్యాకేజింగ్‌ లేబెలింగ్, రిటైల్‌ ట్రేడింగ్‌లు ఉన్నాయి. ఈ లావాదేవీ కింద పతంజలి ఆయుర్వేద్‌కు చెందిన ఉద్యోగులు, ఆస్తులు (పతంజలి బ్రాండ్, ట్రేడ్‌మార్క్స్, డిజైన్లు, కాపీరైట్లు కాకుండా), ప్రస్తుత ఆస్తుల కాంట్రాక్టులు (రుణదాతలు, వాహనాలు, నగదు, బ్యాంకు లైసెన్సులు కాకుండా), లైసెన్సులు, అనుమతులు, పంపిణీ నెట్‌వర్క్‌ బదిలీ అవుతాయి. దీంతో కంపెనీ పేరును సైతం రుచిసోయా ఇండస్ట్రీస్‌ నుంచి ‘పతంజలి ఫుడ్స్‌ లిమిటెడ్‌’గా మార్చనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని