గరిష్ఠాల నుంచి 642 పాయింట్లు వెనక్కి

ఉక్కు ముడి పదార్థాల ఎగుమతులపై సుంకాలు పెంచడంతో లోహ షేర్లు బెంబేలెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి 642 పాయింట్లు తగ్గి,

Published : 24 May 2022 02:54 IST

లోహ షేర్లు బెంబేలు

సమీక్ష

క్కు ముడి పదార్థాల ఎగుమతులపై సుంకాలు పెంచడంతో లోహ షేర్లు బెంబేలెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ గరిష్ఠాల నుంచి 642 పాయింట్లు తగ్గి, స్వల్ప నష్టాల్లో ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 17.40%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 13.20%, టాటా స్టీల్‌ 12.53%, ఎన్‌ఎమ్‌డీసీ 12.44%, సెయిల్‌ 10.96%, హిందాల్కో 3.65%, వేదాంతా 2.77% చొప్పున క్షీణించాయి.డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు కోలుకుని 77.55 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, సియోల్‌, టోక్యో లాభపడగా, హాంకాంగ్‌ నష్టపోయింది. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 54,459.95 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 54,931.30 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకదశలో 54,191.55 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 37.78 పాయింట్లు తగ్గి 54,288.61 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 51.45 పాయింట్ల నష్టంతో 16,214.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,185.75- 16,414.70 పాయింట్ల మధ్య కదలాడింది.

నీ సెన్సెక్స్‌ 30 షేర్లలో 10 నష్టపోయాయి. అల్ట్రాటెక్‌ 3.33%, పవర్‌గ్రిడ్‌ 1.96%, ఐటీసీ 1.93%, హెచ్‌డీఎఫ్‌సీ 1.40%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.35%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.02% చొప్పున తగ్గాయి. ఎం అండ్‌ ఎం 4.14%, మారుతీ 4.07%, హెచ్‌యూఎల్‌ 2.35%, ఎల్‌ అండ్‌ టీ 2.21%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.07%, కోటక్‌ బ్యాంక్‌ 1.45% లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 2048 షేర్లు నష్టాల్లో ముగియగా, 1373 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 156 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని