ఇన్ఫోసిస్‌ వాటాదార్లకు రూ.24,100 కోట్లు

ఇన్ఫోసిస్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.24,100 కోట్ల మేర వాటాదార్లకు చెల్లించింది. ఒక్కో షేరుకు మొత్తం రూ.31 డివిడెండు చెల్లింపుతో పాటు; రూ.11,000 కోట్ల మేర షేర్ల తిరిగి కొనుగోలు రూపంలో  అందించినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు

Published : 26 Jun 2022 03:38 IST

పరిశ్రమలోనే మంచి పనితీరు

పరేఖ్‌ కొనసాగింపునకు బోర్డు ఆమోదం

41వ ఏజీఎమ్‌లో నందన్‌ నీలేకని

దిల్లీ: ఇన్ఫోసిస్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.24,100 కోట్ల మేర వాటాదార్లకు చెల్లించింది. ఒక్కో షేరుకు మొత్తం రూ.31 డివిడెండు చెల్లింపుతో పాటు; రూ.11,000 కోట్ల మేర షేర్ల తిరిగి కొనుగోలు రూపంలో  అందించినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ నందన్‌ నీలేకని వెల్లడించారు. శనివారమిక్కడ జరిగిన కంపెనీ 41వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో ఆయన మాట్లాడుతూ ‘2021-22 అసాధారణ వృద్ధి అయిన 19.7% నమోదైన కారణంగా 16.3 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. ఇది 11 ఏళ్లలోనే ఇన్ఫోసిస్‌కు వేగవంతమైన వృద్ధి’ అని అన్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.13,000 కోట్ల మేర మొత్తం డివిడెండును ప్రకటించింది. సెప్టెంబరులో రూ.11,000 కోట్ల షేర్ల తిరిగి కొనుగోలునూ పూర్తి చేసింది. దీంతో రూ.24,100 కోట్ల మూలధనాన్ని ఖర్చు పెట్టింద’ని నీలేకని తెలిపారు.
పారితోషికం పెంపునకు అనుమతి కోరిన బోర్డు: జులై 1, 2022 నుంచి మార్చి 31, 2027 వరకు అయిదేళ్ల పదవీ కాలానికి సలీల్‌ పరేఖ్‌ను సీఈఓ, ఎండీగా పునఃనియమిస్తూ బోర్డు డైరెక్టర్లు సిఫారసు చేశారని నీలేకని తెలిపారు. పునఃనియామకంతో పాటు వార్షిక పారితోషికాన్ని 88% పెంచి రూ.79.75 కోట్లకు చేర్చడానికి వాటాదార్ల అనుమతిని ఇన్ఫీ కోరింది. ఇన్ఫోసిస్‌కు 25 ఏళ్ల పాటు సేవలందించినందుకు సుధామూర్తికి నీలేకని కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని