అక్కడ మందగమనంతో ఇక్కడ ధరలు తగ్గొచ్చు

అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం ఏర్పడితే, భారత్‌కు ప్రయోజనాలు దక్కవచ్చని సిటీగ్రూప్‌ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ కమొడిటీ ధరల్లో ఓ మోస్తరు తగ్గుదల కనిపించినా.. భారత్‌లో ద్రవ్యోల్బణ సెగల్ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుందని సిటీ గ్రూప్‌లో

Published : 28 Jun 2022 03:04 IST

భారత ద్రవ్యోల్బణంపై సిటీ గ్రూప్‌ అంచనా

అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం ఏర్పడితే, భారత్‌కు ప్రయోజనాలు దక్కవచ్చని సిటీగ్రూప్‌ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ కమొడిటీ ధరల్లో ఓ మోస్తరు తగ్గుదల కనిపించినా.. భారత్‌లో ద్రవ్యోల్బణ సెగల్ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుందని సిటీ గ్రూప్‌లో భారత్‌కు ఎండీ, ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్న సమీరణ్‌ చక్రవర్తి అంటున్నారు. ‘భారత్‌ పలు కమొడిటీల నికర దిగుమతిదారుగా ఉన్నందున ద్రవ్యోల్బణం విషయంలో ప్రయోజనం పొందగలద’ని బ్లూమ్‌బర్గ్‌ టెలివిజన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ మందగమనం వల్ల భారత ఎగుమతులు, ఆర్థికవృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున, ఒత్తిళ్లనైతే ఎదుర్కోవాల్సి రావొచ్చని ఆయన అంచనా వేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణ అదుపుపైనే ప్రపంచ దేశాల పరపతి విధానాలన్నీ దృష్టి సారించినందున ఇది భారత్‌కు కొంత మేర మేలు చేయొచ్చ’ని విశ్లేషించారు.

6 శాతానికి రెపో రేటు?: వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలను బేరీజు వేసుకున్న అనంతరం ఆర్‌బీఐ తన రెపోరేటును ప్రస్తుత 4.9 శాతం నుంచి 5.5 శాతానికి చేర్చే అవకాశం ఉందన్నారు. ఒక వేళ అప్పటికీ ద్రవ్యోల్బణ ఎక్కువగానే కొనసాగితే, రెపో రేటును 6 శాతానికి తీసుకెళ్లవచ్చని చక్రవర్తి అంచనా వేశారు. భాతర కరెంట్‌ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 3.4 శాతానికి చేరొచ్చనీ అంటున్నారు. ఇక రూపాయి 77-79 మధ్య చలించొచ్చని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని