ఉత్కర్ష్‌ క్లాసెస్‌లో 500 నియామకాలు

ఎడ్‌టెక్‌ ప్లాట్‌పామ్‌ ఉత్కర్ష్‌ క్లాసెస్‌ అండ్‌ ఎడ్యుటెక్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 500 మందిని కొత్తగా నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు గురువారం వెల్లడించింది. ఇందులో సీనియర్‌ లీడర్‌షిప్‌తో పాటు ఎడ్యుకేటర్లు, విక్రయాలు-వినియోగదారు

Published : 01 Jul 2022 02:03 IST

దిల్లీ: ఎడ్‌టెక్‌ ప్లాట్‌పామ్‌ ఉత్కర్ష్‌ క్లాసెస్‌ అండ్‌ ఎడ్యుటెక్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 500 మందిని కొత్తగా నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు గురువారం వెల్లడించింది. ఇందులో సీనియర్‌ లీడర్‌షిప్‌తో పాటు ఎడ్యుకేటర్లు, విక్రయాలు-వినియోగదారు సేవా జట్లు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థలో 170 మంది ఎడ్యుకేటర్లతో పాటు 1,200 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2 కోట్ల మంది విద్యార్థులు తమ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో ఉన్నారని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ నిర్మల్‌ గెహ్లోత్‌ వెల్లడించారు. గత రెండేళ్లలో ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకునే పెయిడ్‌ విద్యార్థులు 6,000 నుంచి 15 లక్షలకు పెరిగారని తెలిపారు.

500 మందినే తొలగించాం..బైజూస్‌: లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం టాపర్‌, కోడింగ్‌ ప్లాట్‌ఫాం వైట్‌హాట్‌ జూనియర్‌ నుంచి 500 మందిని మాత్రమే తొలగించినట్లు ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ గురువారం వెల్లడించింది. ఒక్క టాపర్‌ నుంచే 1,100 మంది సిబ్బందిని తొలగించారని వార్తలు ప్రచారం కావడంతో అలాంటిదేమీ లేదని బైజూస్‌ తెలిపింది. దీర్ఘకాలిక వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు వ్యాపార ప్రాధాన్యాలకు తగ్గట్లు కొన్ని మార్పులు చేయడంతో తమ గ్రూప్‌ కంపెనీల నుంచి 500 మంది ఉద్యోగులను తొలగించామని బైజూస్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని