చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు మారలేదు

ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌లతో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నిటిపైనా వడ్డీ రేట్లను జులై-సెప్టెంబరు త్రైమాసికంలోనూ యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2020-21 తొలి త్రైమాసికం నుంచీ ఈ పథకాలపై వడ్డీ రేట్లను సవరించలేదు.

Published : 01 Jul 2022 02:02 IST

దిల్లీ: ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌లతో పాటు చిన్న మొత్తాల పొదుపు పథకాలన్నిటిపైనా వడ్డీ రేట్లను జులై-సెప్టెంబరు త్రైమాసికంలోనూ యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2020-21 తొలి త్రైమాసికం నుంచీ ఈ పథకాలపై వడ్డీ రేట్లను సవరించలేదు. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై వార్షిక వడ్డీ రేటు 7.1%, 6.8 శాతంగా కొనసాగనున్నాయి.  

ఎన్‌ఎస్‌ఈ, ఇతరులపై సెబీ రూ.11 కోట్ల జరిమానా: ఎన్‌ఎస్‌ఈ సహా పలువురిపై సెబీ రూ.11 కోట్ల జరిమానా విధించింది. ఆల్గో ట్రేడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ వ్యవహారం కేసులో ఎన్‌ఎస్‌ఈ, దాని మాజీ అధిపతులు చిత్రా రామకృష్ణ, రవి నరైన్‌లకు తలా రూ.1 కోటి, అలాగే సుప్రభాత్‌ లాల్‌ అనే ఎన్‌ఎస్‌ఈ మాజీ అధికారిపై రూ.1 కోటి జరిమానా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని