హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీన ప్రతిపాదనకు ఎక్స్ఛేంజీల అనుమతి

బ్యాంకింగ్‌ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీన ప్రతిపాదనకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అనుమతి ఇచ్చాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి ఇందుకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలకు ఈనెల 2వ తేదీతో లభించాయి. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు ఇ

Published : 04 Jul 2022 04:36 IST

దిల్లీ: బ్యాంకింగ్‌ అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీన ప్రతిపాదనకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అనుమతి ఇచ్చాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల నుంచి ఇందుకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలకు ఈనెల 2వ తేదీతో లభించాయి. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది. ఈ లావాదేవీ పూర్తయితే భారత కార్పొరేట్‌ చరిత్రలోనే అతిపెద్ద విలీనంగా నిలవనుంది. ఈ ప్రతిపాదనకు ఇంకా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌, కంపెనీ వాటాదార్లు, రుణదాతల అనుమతులు లభించాల్సి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకునేందుకు అంగీకరించినట్లు ఏప్రిల్‌ 4న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించిన సంగతి విదితమే. వచ్చే ఆర్థిక సంవత్సరం 2/3వ త్రైమాసికంలో ఈ విలీనం పూర్తి కావచ్చు.

* అప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 100 శాతం వాటాదార్ల ఆధీనంలో ఉన్నట్లు అవుతుంది.

* హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత వాటాదార్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 41 శాతం వాటాలు లభిస్తాయి. ప్రతి 25 హెచ్‌డీఎఫ్‌సీ షేర్లకు 42 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లభిస్తాయి.

* విలీన సంస్థ బ్యాలెన్స్‌ షీట్‌ రూ.17.87 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుంది. నికర విలువ రూ.3.3 లక్షల కోట్లుగా ఉంటుంది.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.8.36 లక్షల కోట్లు కాగా, హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ.4.46 లక్షల కోట్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని