దీర్ఘకాలిక పెట్టుబడి కోసం...

ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టి మదుపరులకు మంచి లాభాలు ఆర్జించాలనే వ్యూహంతో వచ్చిన పథకం ‘హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అలకేటర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’. దేశంలోని అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అయిన ...

Published : 23 Apr 2021 00:52 IST

క్విటీ, డెట్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టి మదుపరులకు మంచి లాభాలు ఆర్జించాలనే వ్యూహంతో వచ్చిన పథకం ‘హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అలకేటర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’. దేశంలోని అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ దీన్ని తీసుకువచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 30తో ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000.
ఈ ఫండ్‌ సాధారణ పరిస్థితుల్లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడి పెడుతుంది. ఇందులో 40 నుంచి 80 శాతం సొమ్ము ఈక్విటీ పథకాలకు కేటాయిస్తుంది. 10% నుంచి 50% వరకూ రుణ పథకాలకు కేటాయించవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో 30% వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మార్కెట్‌ పరిస్థితుల ప్రకారం ఏదైనా ఒక విభాగంలో అధిక లాభాలు లభించే అవకాశం ఉందని ఫండ్‌ మేనేజర్‌ విశ్వసిస్తే, ఆ విభాగానికి కేటాయింపు పెంచవచ్చు.
‘హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అలకేటర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ పనితీరును నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 65: 35 ఇండెక్స్‌ (టీఆర్‌ఐ) తో పోల్చి చూస్తారు. ఈ ఫండ్‌కు అమిత్‌ గణత్రా (ఈక్విటీ), అనిల్‌ బంబోలి (డెట్‌), కిషన్‌ కుమార్‌ డాగా (గోల్డ్‌ ఈటీఎఫ్‌ స్కీమ్స్‌) ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం దాదాపు 20 వరకూ అసెట్‌ అలకేటర్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ రిస్కు, ఒక మాదిరి ప్రతిఫలం ఇటువంటి పథకాలకు ఉన్న ప్రత్యేకత. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా ఈ జాబితాలో చేరుతోంది. సాధారణంగా అసెట్‌ అలకేటర్‌ ఫండ్లలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి ఉంటుంది. అప్పుడు కొంత లాభాలు కనిపిస్తాయి. అందుకు సిద్ధమయ్యే వారు ఇటువంటి ఫండ్లను పరిశీలించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని