అగ్ని ప్రమాదాల కోసం బీమా

అగ్ని ప్రమాదాల వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకునేందుకు వీలుకల్పించే ప్రత్యామ్నాయ బీమా పథకాలను ఆవిష్కరించటానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సాధారణ

Published : 13 May 2022 04:56 IST

సాధారణ బీమా సంస్థలకు ఐఆర్‌డీఏ అనుమతి

అగ్ని ప్రమాదాల వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకునేందుకు వీలుకల్పించే ప్రత్యామ్నాయ బీమా పథకాలను ఆవిష్కరించటానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సాధారణ బీమా సంస్థలకు అనుమతినిచ్చింది. దీంతో పాటు ఇతర రకాలైన వ్యాపార నష్టాలను సైతం పరిగణనలోకి తీసుకొని, అందుకు అనువైన బీమా పథకాలను సిద్ధం చేయాలని సూచించింది. ఈ మేరకు నూతన నియమ నిబంధనలను ఆవిష్కరించింది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. అగ్ని ప్రమాదాలు, ఇతర రకాలైన వ్యాపార ఇబ్బందులు ఎదురైనప్పుడు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రస్తుతం భారత్‌ గృహ రక్ష, భారత్‌ సూక్ష్మ ఉద్యం సురక్ష, భారత్‌ లఘు ఉద్యం సురక్ష పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రామాణిక పాలసీలు మినహా ఇతర పాలసీలను ఇప్పటివరకూ అనుమతించలేదు. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వీటికి ప్రత్యామ్నాయ పాలసీలను అందించేందుకు బీమా సంస్థలకు అనుమతిని ఇస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఈ ప్రామాణిక పాలసీలకు తోడు.. కొత్త పాలసీలను వినూత్నంగా ఆవిష్కరించే అవకాశం బీమా సంస్థలకు లభించింది. దీనివల్ల బీమా కవరేజీ పెరుగుతుందని, పాలసీదార్లకు భిన్నమైన, తమ తమ అవసరాలకు అనువైన పాలసీలను ఎంచుకునే అవకాశం కలుగుతుందని నియంత్రణ సంస్థ భావిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని