క్రెడిట్‌ కార్డు..జీవన శైలికి తగ్గట్టుగా..

వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకునే విధంగా సరికొత్త కార్డును ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చింది. లివ్‌ ఇట్‌ టుడే (లిట్‌) పేరుతో ఈ కార్డులను ప్రయాణం, వినోదం, షాపింగ్‌, ఇంధనం, హోటళ్లు తదితర వాటిల్లో

Updated : 24 Jun 2022 04:47 IST

వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకునే విధంగా సరికొత్త కార్డును ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తెచ్చింది. లివ్‌ ఇట్‌ టుడే (లిట్‌) పేరుతో ఈ కార్డులను ప్రయాణం, వినోదం, షాపింగ్‌, ఇంధనం, హోటళ్లు తదితర వాటిల్లో తమ అవసరాలకు తగ్గట్టుగా క్రెడిట్‌ పరిమితిని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులు వేర్వేరు అవసరాలకు విభిన్న తరహా కార్డులను అందిస్తూ, రివార్డులు, పాయింట్లు జత చేస్తుంటాయి. దీనివల్ల కార్డుదారులు పలు క్రెడిట్‌ కార్డులను తీసుకొని వాడుకోవాల్సి వస్తుంది. దీనికి బదులుగా అన్ని రకాల ప్రయోజనాలనూ ఒకే కార్డులో మిళితం చేసి, ఈ లిట్‌ కార్డును అందిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. అన్ని రకాల ఖర్చులపై పాయింట్లు, నగదు వెనక్కి ఇవ్వడంతోపాటు, ఎంపిక చేసిన ఓటీటీ వేదికలకు ఉచిత సభ్యత్వం, ఆన్‌లైన్‌తో పాటు, పీఓఎస్‌ లావాదేవీలకూ రివార్డులను అందిస్తున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు