వ్యక్తిగత రుణం Vs లైన్ ఆఫ్ క్రెడిట్..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో కార్మికులు, ఉద్యోగుల ఆర్థిక శ్రేయస్సు, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినింది. దేశంలోని కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తీసివేయడం, జీతం కోతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాయి. ఆర్థిక ఇబ్బందులు

Published : 17 Dec 2020 22:32 IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో కార్మికులు, ఉద్యోగుల ఆర్థిక శ్రేయస్సు, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినింది. దేశంలోని కొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను తీసివేయడం, జీతం కోతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా మందిని రుణాలు తీసుకునేలా బలవంతం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో నగదు కోసం స్థిరాస్తులను లిక్విడిటీగా మార్చుకునే అవకాశం చాలా తక్కువగా ఉండడంతో, మీ అవసరాలకు అనుగుణంగా కొన్ని వారాలు లేదా నెలలకు సరిపడా నగదు కోసం వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ లైన్ వంటి ఫైనాన్సింగ్ ఆప్షన్ లను పరిశీలించడం చాలా ముఖ్యమని ఇండియాలాండ్స్ సీఈఓ & వ్యవస్థాపకుడు గౌరవ్ చోప్రా తెలిపారు.

ఇక్కడ వ్యక్తిగత రుణం vs క్రెడిట్ లైన్ వంటి రెండు ఆర్థిక సాధనాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని వాటి కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.

వ్యక్తిగత రుణం అంటే మీరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకొని, నిర్ణీత వ్యవధిలో నెలవారీ వాయిదాల ద్వారా దానిని తిరిగి చెల్లించాలని చోప్రా తెలిపారు. అయితే, మీరు ఎప్పుడు లేదా ఎలా నిధులను ఉపయోగించుకుంటున్నారో అనే దానితో సంబంధం లేకుండా, మీరు తీసుకున్న రుణ మొత్తానికి వడ్డీని చెల్లించాలి. ఒకవేళ మీకు అదనపు నిధులు అవసరమైతే, మీ ప్రస్తుత రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించి, తాజా రుణం కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.

దీనికి విరుద్ధంగా, క్రెడిట్ లైన్ మీకు వ్యక్తిగత లేదా వ్యాపార-సంబంధిత కార్యకలాపాల కోసం నిధులను అందిస్తుంది. క్రెడిట్ లైన్ ఎప్పుడు, ఎంత రుణం తీసుకోవాలి? ఎలా, ఎప్పుడు తిరిగి చెల్లించాలి? అనే దానిపై సౌలభ్యాన్ని అందిస్తుంది. దీనికి ఉన్న పెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, మీకు అవసరమైనన్ని సార్లు నిధులను ఉపసంహరించుకోవటానికి లేదా రుణం తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది.

వ్యక్తిగత రుణం Vs లైన్ ఆఫ్ క్రెడిట్ :

వ్యక్తిగత రుణంతో పోలిస్తే, క్రెడిట్ లైన్ కి అర్హత సాధించడానికి అధిక క్రెడిట్ స్కోరు అవసరం. ఒకవేళ మీరు ఖర్చుల కోసం చాలా తక్కువ రుణం పొందినట్లయితే, మీరు మళ్ళీ రుణాలను తీసుకోవచ్చు. కొత్త రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీరు అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుందని దీని అర్థం, ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక వడ్డీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ విషయంలో మాదిరిగా మీరు అధిక రుణాలు కలిగి ఉంటే క్రెడిట్ లైన్ మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.

వ్యక్తిగత రుణం, క్రెడిట్ లైన్ రెండూ మీకు అవసరమైన మూలధనాన్ని అందిస్తాయి, రెండు ఆప్షన్లు వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో కొనుగోళ్లకు అనువైన వ్యక్తిగత రుణంతో పోలిస్తే క్రెడిట్ లైన్ సరళమైనది, ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. రుణ మొత్తం, రుణ అవసరం, తిరిగి చెల్లించే సామర్థ్యం పరంగా మీ అవసరాల గురించి మీకు ఖచ్చితంగా తెలిస్తే, అప్పుడు రుణం ఒక మంచి ఆప్షన్ అవుతుంది. వ్యక్తిగత రుణం కాకుండా, తాత్కాలిక నగదు కొరతను భర్తీ చేయడానికి క్రెడిట్ లైన్ సహాయపడుతుంది. ప్రస్తుత సంక్షోభంలో, బహుళ రుణాల కోసం దరఖాస్తు చేయకుండానే (మీరు ఉపయోగించిన వాటికి మాత్రమే చెల్లించండి) నిధులను ఉపయోగించుకునే సౌలభ్యాన్ని ఇస్తున్నందున క్రెడిట్ లైన్ ఆదర్శవంతమైన ఆప్షన్ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని