క్రెడిట్ కార్డ్ అంటే భ‌య‌మా ?

క్రెడిట్ కార్డ్ ఉప‌యోగించ‌డం అంటేనే అప్పు తీసుకోవ‌డం. దీనిని కాల‌ప‌రిమితిలోగా చెల్లిస్తే ఎలాంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. అద‌న‌పు ఛార్జీలు కూడా ప‌డ‌వు. అంతేకాకుండా మీ మొత్తం బ్యాలెన్స్ నుంచి 5 శాతానికి స‌మాన‌మైన న‌గ‌దును చెల్లిస్తే కూడా ఎలాంటి ఛార్జీలు ప‌డ‌వు, కానీ వ‌డ్డీ చెల్లించ‌వ‌ల‌సి

Published : 17 Dec 2020 19:46 IST

క్రెడిట్ కార్డ్ ఉప‌యోగించ‌డం అంటేనే అప్పు తీసుకోవ‌డం. దీనిని కాల‌ప‌రిమితిలోగా చెల్లిస్తే ఎలాంటి వ‌డ్డీ వ‌ర్తించ‌దు. అద‌న‌పు ఛార్జీలు కూడా ప‌డ‌వు. అంతేకాకుండా మీ మొత్తం బ్యాలెన్స్ నుంచి 5 శాతానికి స‌మాన‌మైన న‌గ‌దును చెల్లిస్తే కూడా ఎలాంటి ఛార్జీలు ప‌డ‌వు, కానీ వ‌డ్డీ చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. అయితే మీరు ప్ర‌తీసారి క‌నీస మొత్తాన్ని చెల్లిస్తూ పోతే రుణం ఎప్ప‌టికీ పూర్త‌వ‌దు. అది చాలాకాలం అదేవిధంగా కొన‌సాగుతుంది. అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుణం చెల్లించ‌డం ద్వారా అప్పు తీర్చుకునే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిన విష‌యం ఏంటంటే క్రెడిట్ కార్డు మీద‌ వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి.

క‌నీస చెల్లింపులు అంటే ?

ఉదాహ‌ర‌ణ‌కు మీరు క్రెడిట్ కార్డు మీద‌ రూ.10,000 కొనుగోలు చేసారు. అప్పుడు మీకు క‌నీస మొత్తాన్ని రూ.500 అంటే తీసుకున్న రుణంలో 5 శాతంగా చూపిస్తుంది. అంటే నెల‌కు రూ.500 చెల్లిస్తే అద‌న‌పు ఛార్జీలు ప‌డ‌వు. కానీ ఇంకా రూ.9,500 చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఆ మొత్తానికి నెల‌కు 2 నుంచి 4 శాతం వ‌ర‌కు వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. సంవ‌త్స‌రానికి లెక్కిస్తే ఇది 20 నుంచి 25 శాతం వ‌ర‌కు అవుతుంది. క్రెడిట్ కార్డు రుణాలు ఎక్కువ వ‌డ్డీతో కూడుకున్న‌ద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకొని, ఖ‌ర్చుల విష‌యంలో జాగ్ర‌త్తగా వ్య‌వ‌హ‌రించాలి. పైన చెప్పిన‌ట్లుగా మీరు రూ.9,500 రుణాన్ని అలాగే కొన‌సాగిస్తే నెల‌కు రూ.4 శాతం చొప్పున వ‌డ్డీ ప‌డుతుంద‌న‌కుందాం. వ‌చ్చే నెల‌కు అది రూ.9,800 కి పెరుగుతుంది. అప్పుడు మీరు మ‌రో రూ.10,000 కొనుగోలు చేస్తే, ఇక అప్ప‌టినుంచి క్ర‌మంగా వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. మొత్తం రూ.19,980 కి క‌లిపి వ‌డ్డీ ప‌డుతుంది. అందుకే వ‌డ్డీ వ‌ర్తించని కాల‌ప‌రిమితిలోపే రుణం మొత్తం చెల్లిస్తే మంచిది. అయితే మీరు స‌మ‌యానికి తిరిగి డ‌బ్బు చెల్లించగ‌లిగితే క్రెడిట్ కార్డుతో రుణం తీసుకున్నా ఏం ప‌ర్వాలేదు. కానీ కార్డ్ లిమిట్‌లో 30 శాతం కంటే ఎక్కువ‌గా వినియోగించ‌కూడ‌ద‌నేది సాధ‌రణ నియ‌మం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని