ఆన్‌లైన్‌లో వ్య‌క్తిగ‌త రుణం

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వెంట‌నే వ్య‌క్తిగ‌త రుణం వైపు మొగ్గుచూపుతారు. ఎందుకంటే నామ‌మాత్ర‌పు డాక్యుమెంట్ల‌తో త‌క్కువ స‌మ‌యంలో త్వ‌ర‌గా ల‌భిస్తుంది. అయితే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ల‌కుండా ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వ్య‌క్తిగ‌త‌ రుణానికి దాఖ‌లు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆర్థిక సంస్థ‌లు

Published : 23 Dec 2020 13:10 IST

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వెంట‌నే వ్య‌క్తిగ‌త రుణం వైపు మొగ్గుచూపుతారు. ఎందుకంటే నామ‌మాత్ర‌పు డాక్యుమెంట్ల‌తో త‌క్కువ స‌మ‌యంలో త్వ‌ర‌గా ల‌భిస్తుంది. అయితే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ల‌కుండా ఇంటి నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా వ్య‌క్తిగ‌త‌ రుణానికి దాఖ‌లు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆర్థిక సంస్థ‌లు చాలావ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా త‌క్ష‌ణ‌, తిరిగి చెల్లించేందుకు వీలుగా ఉండే వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఇస్తున్నాయి. అయితే అందులో ఏది ఎంచుకోవాలి ఏది స‌రైన‌ది తెలుసుకోవ‌డం ఎలా ?

సుల‌భంగా ల‌భించే ఆన్‌లైన్ రుణం
ఇప్పుడు వంట‌సామాగ్రి నుంచి గ్యాడ్జెట్ల వ‌ర‌కు ఏదైనా ఆన్‌లైన్‌లోనే ల‌భిస్తుంది. అందుకే బ్యాంకులు ఆర్థిక సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు మ‌రింత సౌల‌భ్యాన్ని కలిగించేందుకు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే రుణం మంజూరు చేస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ రుణాల‌ను న‌మ్మాలా లేదా అనేది చాలా మంది సందేహం.

రుణ సౌక‌ర్యం
ఆన్‌లైన్ ద్వారా రుణం తీసుకునేందుకు ముఖ్య కార‌ణం సుల‌భంగా ల‌భించ‌డ‌మే. డాక్యుమెంట్లు కూడా త‌క్కువ‌గా అవ‌స‌ర‌ముంటాయి. అన్ని డాక్యుమెంట్లు మీ వ‌ద్ద ఉంటే రుణానికి ద‌ర‌ఖాస్తు చేయ‌డం క్ష‌ణాల్లో ప‌ని. అస‌వ‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను వెంట‌నే అప్‌లోడ్ చేసి రుణాన్ని పొంద‌వ‌చ్చు. బ్యాంకుకి వెళ్ల‌వ‌ల‌సిన అవ‌స‌రం లేకుండా ఇంటి నుంచి లేదా కార్యాల‌యం నుంచి ఈ పని చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ద్వారా వ్య‌క్తిగ‌త రుణం క్ష‌ణాల్లో ఆమోదం పొంద‌డ‌మే కాకుండా మీ ఖాతాలోకి డ‌బ్బు చేరుతుంది.

క్రెడిట్ స్కోర్‌
రుణాన్ని జారి చేసే ముందు బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్‌ త‌క్కువ‌గా ఉంటే ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించే అవ‌కాశం లేక‌పోలేదు.

క్రెడిట్ అంచ‌నా
ఆన్‌లైన్ ద్వారా రుణ దాఖ‌లు చేస్తే క‌లిగే మ‌రో సౌక‌ర్యం ఏంటంటే ఇంత‌కుముందులా బ్యాంకులు రుణం జారీ చేసేందుకు సాంప్ర‌దాయంగా వ‌స్తున్న అంశాలు అంటే ప్ర‌స్తుతం మీ ఉద్యోగం, ఆర్థిక ప‌రిస్థితి వంటి అంశాల‌ను ప‌రిశీలించ‌కుండా కేవ‌లం మెరుగైన సిబిల్ స్కోర్ ఉంటే రుణాల‌ను మంజూరు చేస్తున్నాయి. అందుకే సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలంటే తీసుకున్న రుణాలు, బిల్లులు ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తే భ‌విష్య‌త్తులో రుణాలు సుల‌భంగా ల‌భిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని